High Court on HYDRA: వారికి ప్రత్యేక చట్టం ఉందా.. హైడ్రా పనితీరుపై హైకోర్టు అసంతృప్తి..
72 సంస్థల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ ఓవైపు.. హైడ్రా పనితీరుపై హైకోర్టు అసంతృప్తి మరోవైపు. దీంతో మరోసారి హైడ్రా హాట్‌టాపిక్‌గా మారింది. హైడ్రా పనితీరు అశాజనకంగా లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి వాళ్లు మాత్రమేనా అని న్యాయస్థానం ప్రశ్నించింది. హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ మండిపడింది.

చెరువుల అభివృద్ధికి సహకరిస్తున్న, సహకరించడానికి సిద్ధంగా ఉన్న 72 సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.. కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి… సీఎస్‌ఆర్ నిధులతో చెరువులను అభివృద్ధి చేయాలని రంగనాథ్ కోరారు. ఔటర్ పరిధిలో 1025 చెరువులుంటే 61 శాతం చెరువులు జాడలేకుండా పోయాయన్నారు. ప్రస్తుతమున్న 39 శాతం చెరువులనూ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హైడ్రాపై ఉందన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయపాత్ర హైడ్రా పోషిస్తోందని తెలిపారు. మే నెలకల్లా FTL నిర్ధారణ పూర్తవుతుందన్న రంగనాథ్…బఫర్ జోన్‌లో జూలై 2024 ముందు నిర్మించిన నివాసాలు, పర్మిషన్ ఉన్న భవనాలను ఎట్టిపరిస్థితుల్లో తొలగించమని స్పష్టం చేశారు. వాణిజ్య కట్టడాలను మాత్రం తొలగిస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఇటు హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. హైడ్రా పనితీరు అశాజనకంగా లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి వాళ్లు మాత్రమేనా అని న్యాయస్థానం ప్రశ్నించింది. హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ మండిపడింది. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా అని నిలదీసింది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు సార్థకత ఉంటుందని చెప్పుకొచ్చారు న్యాయమూర్తి. ఫాతిమా అనే మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు… హైడ్రా పనితీరుపై సీరియస్ కామెంట్స్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..