AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. కాళేశ్వరం కేసును సీబీఐకు అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. దర్యాప్తుకు సభ ఏకగ్రీవంగా నిర్ణయించింది. నిజాయితీతో విచారణ జరగాలని ఆశిస్తున్నట్టు సీఎం రేవంత్ అన్నారు. ఆ వివరాలు..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన
Cm Revanth Reddy
Ravi Kiran
|

Updated on: Sep 01, 2025 | 6:56 AM

Share

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై తొమ్మిదిన్నర గంటల సుదీర్ఘ చర్చ సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రకటన చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడమే సముచితం అన్నారు రేవంత్‌. కాళేశ్వరం పేరుతో దోచుకున్నవాళ్లందరికీ శిక్షపడాలన్నారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ జరగాలనే కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నట్టు ప్రకటించారు సీఎం. జస్టిస్‌ పీసీ కమిషన్‌.. అలాగే NDSA, ఇతర ఏజెన్సీలు.. క్రిమినల్‌ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించినందువల్లే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు.

నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్ధిక అవకతవకలు.. ఇలా అనేక అంశాలను కమిషన్ ప్రస్తావించిందన్నారు సీఎం. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగే లేదని కమిషన్‌ తన నివేదికలో తేల్చిచెప్పిందన్నారు. మేడిగడ్డ కుంగడానికి ప్లానింగ్‌, డిజైన్‌, నాణ్యత నిర్వహణా లోపాలే కారణమని NDSA గుర్తించిందన్నారు. వీటిన్నింటిపై మరింత లోతుగా, సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని కమిషన్‌ సూచించడంతోనే కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్రాష్ట్ర అంశాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పాలుపంచుకున్నందున స్పీకర్‌ నిర్ణయంతో కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు వెల్లడించారు.