‌Hyderabad: అంబులెన్స్ సైరన్‌ విని ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? షాకింగ్ వీడియో

Telangana DGP Anjani Kumar: అంబులెన్స్.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే వాహనం.. అందుకే.. అంబులెన్స్‌ను చూసి ఎవరైనా, ఎంత అర్జెంట్‌ పని ఉన్నా పక్కకు తప్పుకుంటారు.. పీఎం అయినా.. సీఎం అయినా సరే.. అంబులెన్స్ సైరన్‌ విని..

‌Hyderabad: అంబులెన్స్ సైరన్‌ విని ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? షాకింగ్ వీడియో
Hyderabad News

Updated on: Jul 11, 2023 | 6:30 PM

Telangana DGP Anjani Kumar: అంబులెన్స్.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే వాహనం.. అందుకే.. అంబులెన్స్‌ను చూసి ఎవరైనా, ఎంత అర్జెంట్‌ పని ఉన్నా పక్కకు తప్పుకుంటారు.. పీఎం అయినా.. సీఎం అయినా సరే.. అంబులెన్స్ సైరన్‌ విని.. కాన్వాయ్‌ను ఆపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రోడ్డు ప్రమాదమైనా.. మరేదైనా సరే.. చావుబతుకుల్లో ఉన్న వారిని, రోగులను ఆసుపత్రికి తరలించే.. ప్రాణవాహిని అంబులెన్స్‌.. అలాంటి అంబులెన్స్ ను కొందరు ఇష్టమొచ్చినట్లు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా.. ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన సైరన్‌ ను.. బజ్జీల కోసం వాడాడు.. దర్జాగా అంబులెన్స్‌ సైరన్‌ మోగిస్తూ వచ్చి.. రోడ్డు సైడ్‌ కు ఆపాడు.. అనంతరం దానిలో ఉన్న సిబ్బంది.. హోటల్‌ దగ్గరకు వెళ్లి బజ్జీలు తినడం మొదలు పెట్టారు.. డ్రైవర్‌ కూడా మాజా బాటిల్‌ కొనుక్కుని.. మజా చేద్దామనుకున్నాడు.. ఇంతలోనే ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లోపల పేషంట్‌ ఎక్కడా అటూ ప్రశ్నించడంతో సీన్ రివర్స్‌ అయింది.. ఈ షాకింగ్‌ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

నారాయ‌ణ‌గూడలో ఓ ప్రైవేటు ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవ‌ర్ సైర‌న్ మోగించడంతో ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్‌ను క్లియ‌ర్ చేశారు. రోగి ఉన్నాడనుకుని.. ముందు కూడా ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాలంటూ ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు.. కానీ.. ఆ అంబులెన్స్ కొంచెం ముందుకెళ్లి రోడ్డు పక్కన ఆగింది.. దానిలో ఉన్న సిబ్బంది హోటల్‌ దగ్గరకు వెళ్లి.. బజ్జీలు తినడం మొదలు పెట్టారు.. డ్రైవర్‌ కూడా కూల్‌ డ్రింక్‌ తీసుకున్నాడు.. అయితే, అక్కడున్న కానిస్టేబుల్‌.. రోగి లేడని నిర్ధారించుకుని.. డ్రైవర్‌ను ప్రశ్నించారు. అంబులెన్స్‌లో రోగి ఎవ‌రైనా ఉన్నారేమో అనుకొని ట్రాఫిక్ క్లియ‌ర్ చేశామని.. కూల్ డ్రింక్, బ‌జ్జీల కోసం సైర‌న్ ఎందుకు మోగించావంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనను కానిస్టేబుల్ రికార్డు చేయడంతో.. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

అయితే, ఈ వీడియోను డీజీపీ అంజ‌నీ కుమార్ స్పందించారు. అత్యవసర స‌మ‌యాల్లో ఉప‌యోగించే సైర‌న్‌ను దుర్వినియోగం చేయొద్దంటూ డీజీపీ ట్విట్ చేసి అంబులెన్స్ డ్రైవర్లకు సూచించారు. అత్యవసర ప‌రిస్థితుల్లోనే అంబులెన్స్‌ సైర‌న్ ఉపయోగించాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..