Telangana: సనత్‌నగర్‌లో విషాదం.. GMHC స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి

|

Apr 17, 2024 | 8:41 AM

సనత్‌నగర్‌లో కార్తికేయ(12) అనే బాలుడు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో పడింది. బాలు తీసుకు రావడానికి గోడ దూకి వెళ్లిన కార్తికేయ ఎంతసేపటికి తిరిగి రాలేదు. దీంతో భయంతో తోటి పిల్లలు కార్తికేయ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి చూడగా స్విమ్మింగ్ పూల్‌లో కార్తికేయ విగతజీవిగా కనిపించాడు. సంఘటన సమయంలో స్విమ్మింగ్ పూల్ బంద్ ఉండడంతో..

Telangana: సనత్‌నగర్‌లో విషాదం.. GMHC స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి
boy drown in GMHC swimming pool
Follow us on

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16: సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా బాల్‌ స్వి్మ్మింగ్‌ పూల్‌లో పడింది. బాల్ కోసమని నీళ్లలోకి దూకిన బాలుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన సనత్‌నగర్‌లో చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకెళ్తే..

సనత్‌నగర్‌లో కార్తికేయ (12) అనే బాలుడు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో పడింది. బాలు తీసుకు రావడానికి గోడ దూకి వెళ్లిన కార్తికేయ ఎంతసేపటికి తిరిగి రాలేదు. దీంతో భయంతో తోటి పిల్లలు కార్తికేయ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలుడి తల్లిదండ్రులు వచ్చి చూడగా స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవిగా కనిపించాడు. సంఘటన సమయంలో స్విమ్మింగ్ పూల్ బంద్ ఉండడంతో బాలుడిని ఎవరు గమనించకపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అల్లరి చేస్తూ కేరింతలు కొడుతూ కళ్లముందే తిరుగుతూ కనిపించిన కొడుకు హఠాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరో ఘటన.. స్కూల్‌ బస్సు చక్రాల కింద పడి ఏడాదిన్నర చిన్నారి దుర్మరణం

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మద్దుట్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏడాదిన్నర వయసున్న చిన్నారి మంగళవారం ప్రమాదవశాత్తు స్కూల్‌ బస్సు కింద పడి మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మద్దుట్ల గ్రామంలో కాపురం ఉంటోన్న రజాక్‌, హసీనా దంపతులకు ఐదేండ్ల కొడుకు సాజిత్‌, ఏడాదిన్నర అరీబా సంతానం. పెద్ద కుమారుడు సాజిత్‌ రామన్నపేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుచున్నాడు. కొడుకును స్కూల్‌కు పంపేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన హసీనా స్కూల్‌ బస్సు వద్దకు కూతురు అరీబాను కూడా తీసుకొచ్చింది. కొడుకును బస్సు ఎక్కించిన తర్వాత బస్సు ముందుకు కదిలింది. ఇంతలో తల్లి పక్కనే ఉన్న అరీబా పైకి బస్సు టైర్‌ ఎక్కడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు అల్లాడిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.