AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గ్రేటర్ వాసులారా జలమండలి వాటర్ తాగుతున్నారా..? అయితే మీకే ఈ వార్త

వర్షాకాలంలో పైపు లైన్ల లీకేజీల కారణంగా నీరు కలుషితం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీంతో జలమండలి సరఫరా చేసే నీరు ఏ మాత్రం రంగుమారినా.. వాసన వచ్చిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

Hyderabad: గ్రేటర్ వాసులారా జలమండలి వాటర్ తాగుతున్నారా..? అయితే మీకే ఈ వార్త
Hyderabad Water
Vidyasagar Gunti
| Edited By: Ram Naramaneni|

Updated on: Jul 24, 2023 | 12:14 PM

Share

హైదరాబాద్ లో వానొచ్చిందంటే వరద ముంపే కాదు ముప్పేట దాడి చేసేందుకు సమస్యలు కాచుకొని కూర్చుంటాయి. వాన వస్తే వరద.. వరద వస్తే నీట మునిగే ఇళ్లు… గుంతలు తేలే రోడ్లు, తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని కాలనీలు ఇలాంటి దయనీయ పరిస్థితులు నగరంలో లోతట్టు కాలనీలలో కనిపిస్తూ ఉంటాయి. వర్షాలు తగ్గాయి.. వరదలు తగ్గుముఖం పట్టాయి. కానీ డ్రైనేజీలు పొంగుతూనే ఉండగా.. కాలనీల్లో మురుగునీరు పారుతూనే ఉంది. గ్రేటర్ డ్రైనేజీ లైన్లు, మంచినీటి పైప్ లైన్లు పక్క పక్కనే ఉన్నాయి. పురాతన పైపు లైన్లు కావడంతో లీకేజీలకు లేదు కొదవ అన్నట్లు తయారైంది పరిస్థితి. ఈ సమయంలో జలమండలి సరఫరా చేసే నీళ్లలో ఏ మాత్రం తేడా కనిపించినా తాగకుండా ఉండటమే బెటర్. మరీ ఏం చేయాలి అంటారా..? అదే ఇప్పుడు వివరించబోతున్నాం.

వర్షాకాలంలో పైపు లైన్ల లీకేజీల కారణంగా నీరు కలుషితం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీంతో జలమండలి సరఫరా చేసే నీరు ఏ మాత్రం రంగుమారినా.. వాసన వచ్చిన వెంటనే హైదరాబాద్ జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వాటర్ పొల్యుషన్ ముప్పు అధికంగా ఉందని.. జలమండలికి అందిన ఫిర్యాదులే చెబుతున్నాయి. గత రెండు వారాల్లో 790 ఫిర్యాదులు కలుషిత నీరు వస్తోందని వచ్చాయి. వీటిన్నింటిని పరిష్కరించేందుకు అధికారులు రంగంలోకి దిగి 70 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్లు చెబుతున్నారు. అసలే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉన్న ఈ సమయంలో ఎలాంటి అనారొగ్యానికి గురైన తాగే నీటిపైన ఓ కన్నేసి ఉంచడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాంతులు, విరేచనాలు వంటి కాలనీల్లో ఎక్కువ మందికి వస్తే అది వాటర్ పొల్యూషన్ గానే గుర్తించాలి.

మరోవైపు వరద ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని జలమండలి సైతం కొన్ని చర్యలు చేపట్టింది. మంచినీరు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నీటి నాణ్యత పరీక్షలను రెట్టింపు చేసింది. సీవరేజ్ ఓవర్ ఫ్లో ఉంటే వెంటనే క్లియర్ చేయాలని సిబ్బందికి అధికారులు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్లోరిన మాత్రల్ని పంపిణీ చేయాలని జలమండలి ఎండీ దాన కిషోర్ కింది అధికారులను ఆదేశించారు. గాజులరామారం, జీడిమెట్ల, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ చింతల్ బస్తీ, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కలుషిత మంచినీరు వస్తోందని పిర్యాదులు అందాయి.

వానాకాలంలో మంచినీటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. కాచి చల్లార్చిని మంచినీటిని తాగాలి.

2. రంగుమారినా, వాసన వచ్చినా ఆ నీరు తాగొద్దు

3. మలినాలు ఉంటే నీటిని తాగొద్దు

4. వాటర్ పొల్యూషన్ అయినట్లు భావిస్తే వెంటనే జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వాలి.

5. చిన్నపిల్లలకు సురక్షిత మంచినీరు మాత్రమే ఇవ్వాలి

6. వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి వాటితో బాధపడితే వాటర్ ను చెక్ చేసుకోవాలి

7. మీ ఏరియాలో వరద వస్తే మంచినీటి నాణ్యత పరీక్షలు చేయమని అధికారులను కోరాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..