AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సీటీలో చుట్టుపక్కల టాప్ టెన్ ఫ్యామిలీ వన్ డే ట్రిప్స్.. బడ్జెట్ 5 వేలే

సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లో పిల్లలు ఎక్కడికైనా తీసుకువెళ్లమని గోల చేయడం కామన్. హైదరాబాదులో ఉండే మధ్యతరగతి కుటుంబాలకి టూర్లు, ట్రిప్పులు కొంత ఆర్థిక భారమే. కేవలం ఒక్కరోజులో తక్కువ బడ్జెట్లో మంచి ట్రిప్ లాంచ్ చేసుకుంటున్నారా... హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టాప్ టెన్ వన్డే విజిట్ స్పాట్స్ మీకోసం...

Hyderabad: సీటీలో చుట్టుపక్కల టాప్ టెన్ ఫ్యామిలీ వన్ డే ట్రిప్స్.. బడ్జెట్ 5 వేలే
Family Trip
Rakesh Reddy Ch
| Edited By: Ram Naramaneni|

Updated on: May 03, 2025 | 1:40 PM

Share

1. అనంతగిరి హిల్స్: హైదరాబాద్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మంచి రిసార్ట్స్, ట్రెక్కింగ్, పూర్తి పచ్చదనంతో ఒక్కరోజు గడపడానికి టాప్ చాయిస్

2. నాగార్జునసాగర్ :  నాగార్జునసాగర్ వెనకాల ఉన్న బ్యాక్ వాటర్స్ లో వైజాగ్ కాలనీ, సాగర్ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఉన్న బోటింగ్ ఇలా మెమొరబుల్ వన్డే ట్రిప్ ని ప్లాన్ చేయొచ్చు.

3. శ్రీశైలం :  ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం కూడా వచ్చే ట్రిప్ ఇది.

4. పోచారం వైల్డ్ లైఫ్ సాంచురి : ప్రకృతి ప్రేమికులు, ఫ్యామిలీతో వెళ్లి అలా జంతువులను చూస్తూ మంచి లంచ్ చేయాలనుకుంటే ఇది మంచి ఛాయిసే.

5. వరంగల్ :  హైదరాబాద్ నుంచి రెండున్నర గంటల జర్నీ. వేయి స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్, రామప్ప దేవాలయం ఇవన్నీ ఒక ఎత్తైతే అక్కడున్న లక్నవరం చెరువు వాటర్ రిసార్ట్లో ఒకరోజు గడపడం ఓ మధురమైన అనుభూతి.

6. బొగత వాటర్ ఫాల్స్:  తెలంగాణ మినీ నయాగరా వాటర్ ఫాల్స్ ఇవి. మంచి ఫ్రీకౌట్రిప్.

7. సోమశిల : కృష్ణానది బ్యాక్ వాటర్. అక్కడున్న రిసార్టులు, పచ్చని ప్రకృతి, బోటింగ్ తో పాటు మాంచి ఫిష్ వెరైటీస్ తో భోజనం చేయడం ఒక అనుభూతిని మిగులుస్తుంది.

8. యాదగిరిగుట్ట : తెలంగాణ తిరుపతి వెళ్లే దారిలో ఉన్న స్వర్ణ గిరి టెంపుల్, యాదగిరి గుట్ట చుట్టుపక్కల ఉన్న రిసార్టులు అక్కడే ఉన్న సురేంద్రపురి అన్నీ కలిపి ఒక రోజులో చుట్టేయొచ్చు.

9. రామోజీ ఫిలిం సిటీ : పూర్తి రోజంతా గడపగలిగే ప్లేస్. ఫ్యామిలీ పిల్లలతో మంచి ఫోటోగ్రఫీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ కలిపిన ఒక ప్యాకేజీ అని చెప్పొచ్చు.

10. కొండపోచమ్మ, రంగనాయక సాగర్ : ఈ రెండు రిజర్వాయర్ల చుట్టూ ఇప్పుడు పిక్నిక్ స్పాట్లు వెలిశాయి. ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న చిన్న పార్కులు కూడా వచ్చేశాయి. ఈ రెండు రిజర్వాయర్ల దగ్గర వీకెండ్ వచ్చిందంటే వందలాది కుటుంబాలు వచ్చి సేద తీరుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…