Balapur Laddu: భాగ్యనగర్ గణేషులకు నాయకుడు.. ముందుగా కదిలే వినాయకుడు.. బాలాపూర్ గణేష్ లడ్డు విశేషాలు తెలుసా..
భాగ్యనగర గణేష్ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్ లడ్డూ.. ఏటా ఈ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతోమంది సంపన్నులు పోటీపడుతుంటారు. వందలూ కాదు.. వేలూ కాదు.. లక్షలు పలుకుతుంది..
భాగ్యనగర గణేష్ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్ లడ్డూ.. ఏటా ఈ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతోమంది సంపన్నులు పోటీపడుతుంటారు. వందలూ కాదు.. వేలూ కాదు.. లక్షలు పలుకుతుంది బాలాపూర్ లడ్డూ.. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2019లో జరిగిన వేలంలో ఏకంగా 17 లక్షల 60 వేలు దక్కించుకుంది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ మరిన్ని ప్రత్యేక రుచులతో సిద్దమవుతోంది. సరికొత్త రికార్డులకు రెడీ అవుతోంది. ఇంతకీ బాలాపూర్ లడ్డూ కథ ఏమిటో తెలుసుకుందాం.. కరోనా కారణంగా గత ఏడాది లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ… ఈ తరుణంలో ఈ ఏడాది లడ్డూ వేలం ఉంటుందా.. ఉండదా.. అనే అనుమానాలు ఉండగా.. దానిపై బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన చేశారు.
ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం వేస్తామని వెల్లడించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మండపానికి వచ్చే భక్తులు మాస్క్ ఉంటేనే అనుమతి ఇస్తామన్నారు. ఈ ఏడాది 21 కిలోల లడ్డూ పెడుతున్నాం. 15 అడుగుల ఎత్తున గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ కారణంగా మండపంలోకి రావడానికి పోవడానికి ప్రత్యేక దారులు ఏర్పాటు చేశామని..
గత సంవత్సరం కోవిడ్ కారణంగా లడ్డూ వేలం పాట వేయలేదు.. కానీ, ఈ సంవత్సరం వేలం పాట నిర్వహిస్తామన్నారు.. మరోవైపు.. నాలుగు రోజుల కురుస్తున్న వర్షాలతో ఏర్పాట్లకు అంతరాయం కలిగినా.. చకచకా ఏర్పాటు జరగుతున్నాయన్నారు. కోల్‌కతా నుంచి వచ్చిన 56 మంది సిబ్బంది 7 రోజుల నుండి శ్రమిస్తున్నారని.. పనులు చివరి దశకు వచ్చాయని తెలిపారు. నవరాత్రుల్లో గణేశుని దర్శించడానికి రోజుకు 10 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని భావిస్తున్నామని.. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థాననికి సంబంధించిన సెట్టింగ్ వేశామని.. వినాయకుని చెవులు, కళ్లు.. కదులుతూనట్టు చేయడం ఈసారి ప్రత్యేకతగా తెలిపారు కళ్లెం నిరంజన్ రెడ్డి.
లడ్డూ కథ..
లడ్డూల వేలంలో బాలాపూర్‌ది ప్రత్యేక స్థానం ఉంది. 26 ఏళ్లుగా కొనసాగుతోంది బాలాపూర్ లడ్డూ వేలం. ఈ లడ్డూను దక్కించుకుంటే సిరిసంపదలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే పోటీ పడి మరీ వేలం పాటలో పాల్గొంటారు భక్తులు. గత ఏడాది ఇక్కడి లడ్డూ 16లక్షల 60 వేల రూపాయలు ధర పలికింది. ఈసారి కూడా గతంలో కంటే అధిక ధర పలికే అవకాశం ఉంది. 1994 నుంచి ప్రారంభమైంది బాలాపూర్ లడ్డూ వేలం. ఆ ఏడాది 450 రూపాయలకు దక్కించుకున్నారు.
భోలక్‌పూర్‌లో ఏర్పాటు చేసిన శ్రీసిద్ధివినాయక మండపంలో బంగారం లడ్డూను కైవసం చేసుకునేందుకు భక్తులుపోటీపడ్డారు. 123 గ్రాముల బంగారం లడ్డూను విష్ణుప్రసాద్ అనే వ్యాపారి 7 లక్షల 56 వేలకు సొంతం చేసుకున్నాడు. గత ఏడాది ఇక్కడి లడ్డూ 8 లక్షల 1 వెయ్యి రూపాయలు పలికింది. ఈసారి ఆర్థికమాంద్యం ఎఫెక్ట్ కనిపించింది. బాలాపూర్ లడ్డూ దక్కించుకుంటే అదృష్టం.. ఈసారి గత రికార్డులను బ్రేక్ చేస్తుందా?
భాగ్యనగర గణేషులకు నాయకుడు.. ముందుగా కదిలేది బాలాపూర్ వినాయకుడే
1994: కొలను మోహన్ రెడ్డి – రూ.450 1995: రూ.4500 1996- కొలను కృష్ణారెడ్డి – రూ.18,000 1997- రూ.28,000 2008- రూ.5,07,000
2015- కళ్లెం మదన్ మోహన్ రెడ్డి – రూ.10,32,000 2017- నాగం తిరుపతి రెడ్డి – రూ.15,60,000 2019- కొలను రామిరెడ్డి – రూ.17,60,000 2020లో కరోనా కారణంగా వేలం జరగలేదు
Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమి చేరుకోవాలంటే..