Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“విద్యా, ఆరోగ్య రక్షణ ద్వారా మాత్రమే రాష్ట్రాభివృద్ధి సాధ్యం” : కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‎చార్జ్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‎లోని గాంధీ సెంటీనరి హాల్లో జరిగిన సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు, నిరుద్యోగ ప్రతినిధులు, విద్యార్థి నాయకుల అధ్వర్యంలో "ప్రజలు ఈ ప్రభుత్వం నుంచి  ఏం ఆశిస్తున్నారు" అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించబడింది. కాంగ్రెస్ వార్ రూమ్ చైర్మన్ మల్లాది పవన్ నేతృత్వంలో డా. రియాజ్ సమన్వయంతో సాగిన ఈ సమావేశంలో మల్లాది పవన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయాలని సేకరించి ప్రభుత్వ సేవలను మరింత మెరుగ్గా అందజేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు.

విద్యా, ఆరోగ్య రక్షణ ద్వారా మాత్రమే రాష్ట్రాభివృద్ధి సాధ్యం : కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‎చార్జ్
Telangana Congress
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Srikar T

Updated on: Mar 03, 2024 | 3:37 PM

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‎లోని గాంధీ సెంటీనరి హాల్లో జరిగిన సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు, నిరుద్యోగ ప్రతినిధులు, విద్యార్థి నాయకుల అధ్వర్యంలో “ప్రజలు ఈ ప్రభుత్వం నుంచి  ఏం ఆశిస్తున్నారు” అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించబడింది. కాంగ్రెస్ వార్ రూమ్ చైర్మన్ మల్లాది పవన్ నేతృత్వంలో, డా. రియాజ్ సమన్వయంతో సాగిన ఈ సమావేశంలో మల్లాది పవన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయాలని సేకరించి ప్రభుత్వ సేవలను మరింత మెరుగ్గా అందజేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీసీసీ ఇంచార్జీ సెక్రటరీ దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం వర్ధిల్లినప్పుడు మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉందన్నారు. అందుకోసమే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే అంశం మీద చర్చాగోష్టి నిర్వహించినట్లుగా చెప్పారు. నియంతృత్వం ఎప్పుడు కూడా ప్రజలకు న్యాయం చేయదని స్వేచ్ఛభరితమైన ప్రజాస్వామ్యం మాత్రమే ప్రజలకు న్యాయం చేకూరుస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజా సంఘాల పాత్ర ఎంతో ఉందని.. వారి సమస్యల కోసం ఎప్పుడైనా నన్ను కలవచ్చని వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో సమన్వయం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటానని అన్నారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నిరుద్యోగులకు న్యాయం చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, వివిధ సామాజిక సంస్థల బాధ్యులు చెప్పిన విషయాలు, ఇచ్చిన వినతిపత్రాలను స్వీకరించారు. వాటిని ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకు వెళతానని, ఒక పార్టీ ప్రతినిధిగా ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నుండి ప్రసన్న హరికృష్ణ, ఎర్షాద్, డా. హరినాధ్, డా. భూమయ్య, మల్లేశం తదితరులు ప్రసంగించారు. ప్రజా సమస్యలను గుర్తించే విధంగా ఇలాంటి సమావేశాన్ని నిర్వహించడం సంతోషకరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువత నుంచి శివానంద స్వామి, అశోక్ రెడ్డి, సురేష్, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు ఈ సమావేశాన్ని సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది నిరుద్యోగులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..