AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad MMTS: హైదరాబాదీలకు అలర్ట్‌.. రేపటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాద్‌, సికింద్రాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. జంట నగర వాసులు ఎక్కువగా ఉపయోగించే ఎంఎంటీఎస్‌ రైళ్ల విషయంలో కీలక ప్రకటన చేసింది. మే 25, 26వ తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు, నాలుగు డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Hyderabad MMTS: హైదరాబాదీలకు అలర్ట్‌.. రేపటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
Mmts Trains
Narender Vaitla
|

Updated on: May 24, 2024 | 6:42 PM

Share

హైదరాబాద్‌, సికింద్రాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. జంట నగర వాసులు ఎక్కువగా ఉపయోగించే ఎంఎంటీఎస్‌ రైళ్ల విషయంలో కీలక ప్రకటన చేసింది. మే 25, 26వ తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు, నాలుగు డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు జరుగుతోన్న విషయం తెలిసిందే. దీంతో పాటు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణంల నేపథ్యంలో పలు మార్గాల్లో 22 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ప్రకటించారు. అలాగే సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య సర్వీసులందించే నాలుగు డెమూ రైళ్ల రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయే రైళ్లను రద్దు చేశారు, పూర్తి వివరాలు..

మే 25, 26వ తేదీల్లో ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా మధ్య ప్రయాణించే రైళ్లను రద్దు చేశారు. అలాగే మే25వ తేదీన మేడ్చల్‌-లింగంపల్లి, లింగంపల్లి-మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్-మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌ రైళ్లను రద్దు చేశారు.

Mmts

మేడ్చల్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-మేడ్చల్‌, మేడ్చల్‌-లింగంపల్లి, లింగంపల్లి-మేడ్చల్‌, సికింద్రాబాద్‌ మేడ్చల్‌ మధ్య ప్రయాణించే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక సిద్ధిపేట-సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణించే రైలును మే 25తేదీన, 26వ తేదీన రద్దు చేశారు. ఈ తేదీలకు అనుగుణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..