Telangana: అయ్య బాబోయ్‌.. హైదరాబాద్‌లోనే ఇన్ని పాములు పట్టుకున్నారా..? నగరంలో నలువైపులా విష సర్పాలే..

Hyderabad: రాజేద్రనగర్ లోని లారీ పార్కింగ్ ప్రాంతంలో 20 అడుగుల కొండ చిలువ దర్శనమిచ్చింది. ఒక్క కొండ చిలువ కాదు.. నాగుపాము, తాచుపాము, జెర్రీ పోతులు, రక్త పింజర ఇలా చాలా రకాల పాము లు చాలా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. నాంపల్లి, ఉప్పల్, మియాపూర్, కొంపల్లి, జీడిమెట్ల, నిజాంపేట్, దమ్మాయి గుడా, పఠాన్ చెరు వంటి లోతట్టు, శివారు ప్రాంతాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Telangana: అయ్య బాబోయ్‌.. హైదరాబాద్‌లోనే ఇన్ని పాములు పట్టుకున్నారా..? నగరంలో నలువైపులా విష సర్పాలే..
Snake
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 01, 2023 | 4:24 PM

హైదరాబాద్,అక్టోబర్01: సిటీ లో డిఫరెంట్ వెదర్ కనిపిస్తుంది. ఎండ మండుతుంది అనేసరికి…వెంటనే ఉక్కపోత ఆ వెంటనే భారీ వర్షం తో ఉక్కిరబిక్కిరి అవుతున్నారు నగరవాసులు. ఇలాంటి డిఫరెంట్ వెదర్ కి మనుషులమే ఇబ్బంది పడుతుంటే వన్య ప్రాణులు ఏం చేయాలో తెలియక జనారణ్యంలో కి వస్తున్నాయి. చల్లదనం కోసం బయటకు వస్తున్న వన్యప్రాణులను చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురి అవుతున్నారు నగరవాసులు. వర్షాకాలం వచ్చినప్పటి నుండి ఎప్పుడు వర్షం పడుతుందో..ఎప్పుడు ఎండ వస్తుందో తెలియని విచిత్ర వాతావరణం లో విష సర్పాలు బుసలు కొడుతూ జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. అరణ్యాన్ని వదిలి జనారణ్యం లోకి వస్తున్న పాములను చూసి నగరవాసులు భయపడిపోతున్నారు. ఎక్కడ ఏ పాము నక్కి ఉందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు శివారు ప్రాంతవాసులు. మనుషుల మధ్య కి వస్తున్న పాములకు ఎలాంటి హాని చేయకుండా చాలా మంది స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చి వాటిని సంరక్షిస్తున్నారు.

తాజాగా, రాజేద్రనగర్ లోని లారీ పార్కింగ్ ప్లేస్ లో 20 అడుగుల కొండ చిలువ దర్శనం ఇచ్చింది. ఒక్క కొండ చిలువ కాదు.. నాగుపాము, తాచుపాము, జెర్రీ పోతులు, రక్త పింజర ఇలా చాలా రకాల పాము లు చాలా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. నాంపల్లి, ఉప్పల్, మియాపూర్, కొంపల్లి, జీడిమెట్ల, నిజాంపేట్, దమ్మాయి గుడా, పఠాన్ చెరు వంటి లోతట్టు, శివారు ప్రాంతాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కేవలం ఈ ఎనిమిది నెలల్లో స్నేక్ క్యాచర్ టీమ్ రెస్క్యూ చేసిన పాముల లెక్క చూస్తే.. ఔరా అంటారు…జనవరి నుండి సెప్టంబర్ 15 నాటికి ఒక్క హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 7వేల పాములు పట్టుకున్నారు. స్నేక్‌ క్యాచర్‌ టీమ్ దృష్టి రాకుండా ఉన్న పాముల లెక్క ఇంకా ఎంత ఉంటుందో తెలియదు. ఇవన్నీ వాతావరణ మార్పులు కారణంగానే అంటున్నారు. వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోవడం ఒకటైతే.. మన పరిసరాల్లో చెట్ల పొదలు ఉండి.. పరిశుభ్రంగా ఉండకపోవడం, సమీప చెరువులు, చెట్ల పొదలు తొలగించటంతో ఆవాసం కోసం పాములు నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..