Hyderabad: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి సోలార్‌ సైకిల్‌ ట్రాక్‌

Hyderabad: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి సోలార్‌ సైకిల్‌ ట్రాక్‌

Ram Naramaneni

|

Updated on: Oct 02, 2023 | 10:40 AM

ఐటీ కారిడార్‌ని కలుపుతూ, ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న ఈ ట్రాక్.. మొత్తం 23 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ సైకిల్ ట్రాక్‌ని అక్టోబర్ 1 రాత్రి ఐటీ, పురాపాలక శాఖ మంత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ సైకిల్ ట్రాక్ పైన సోలార్ ప్లేట్లు ఉంటాయి. అందువల్ల 16 మెగా వాట్ల కరెంట్ జనరేట్ అవుతుంది. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

హైదరాబాద్‌లోని నార్సింగి దగ్గర 23 కిలోమీటర్ల మేర నిర్మించిన సోలార్ సైకిల్ ట్రాక్‌ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హెచ్ఎండీఏ నిర్మిచిన ఈ సోలార్ సైకిల్ ట్రాక్ దేశంలోనే మొదటిది. 90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ట్రాక్ సైక్లిస్ట్‌ల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. నానక్ రామ్ గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 9 కిలోమీటర్లు, నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్ల మేర మూడు లేన్‌లతో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. 4.5 మీటర్స్ వెడల్పుతో ట్రాక్ ఉంటుంది. ఇరువైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్ ఏర్పాటుచేశారు. భద్రత కోసం ట్రాక్ చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ట్రాక్ పక్కన సువాసనలను వెదజల్లే పూల మొక్కలను పెట్టారు.

సైక్లిస్ట్‌ల కోసం పార్కింగ్, టాయిలెట్స్ సదుపాయాలు కూడా కల్పించారు. ఈ ట్రాక్‌లో సోలార్ రూఫ్‌తో పాటు.. లైట్లు కూడా ఉంటాయి. ఈ సోలార్ రూఫ్ వల్ల 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అందులో సైకిల్ ట్రాక్ కోసం 1 మెగావాట్ ఉపయోగిస్తారు. మిగిలిన విద్యుత్‌ను అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న లైట్ల కోసం వినియోగిస్తారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. ఐటీ కారిడార్‌లో సైక్లిస్టులకు ఎంతో ఉపయోగపడుతుందని అభికారులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Oct 02, 2023 10:38 AM