Telangana: క్రికెట్ అభిమానులకు శుభవార్త..! ఒక వైపు ప్రపంచ కప్.. మరోవైపు HCA ఎన్నికల నగారా
Hyderabad: ప్రపంచ కప్ సందర్భంగా హైదరాబాద్ లో మ్యాచ్ ల నిర్వహణ కోసం ఇప్పటికే బీసీసీఐ నుండి 117 కోట్ల రూపాయల నిధులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చేరాయి. నిధులు అందిన వెంటనే ఉప్పల్ స్టేడియాన్ని మరమ్మతులు చేశారు. గతంలో ఐపీఎల్ నిర్వహణ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీటింగ్ తో పాటు ఉప్పల్ స్టేడియంలో
హైదరాబాద్,అక్టోబర్01: అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 20వ తారీఖున హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 20న హెచ్‌సీఏకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రెటరీ , ట్రెజరర్, ఈసీ మెంబర్స్ కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 2019లో చివరిసారిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయి. అప్పటినుండి ఎన్నికలు జరగటం లేదు. అప్పటి ప్రెసిడెంట్ గా గెలిచిన అజారుద్దీన్ పదవీకాలం పూర్తయినా కూడా ఎన్నిక జరగలేదు. హెచ్ సిఏ అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. దీంతో అప్పటినుండి హెచ్ సీఏ వ్యవహారాలన్నీ కూడా జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నే చూసుకుంటుంది. అంతకుముందు ఉన్న హెచ్సీఏ ఆఫీస్ బేరర్స్ ను రద్దు చేస్తూ లావు నాగేశ్వరరావు కమిటీ ప్రకటించింది.
ఇప్పటికే ఎలక్టర్ల లిస్టును హెచ్సీఏ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. ప్రతినిధుల పేర్ల మార్పు కోసం అక్టోబర్ 4. అక్టోబర్ 5వ తేదీలలో మార్చుకోవచ్చు. ఫైనల్ లిస్టును అక్టోబర్ 7 వ తారీఖున విడుదల చేస్తారు.. నామినేషన్లను అక్టోబర్ 11 నుండి దాఖలు చేసుకోవచ్చు. అక్టోబర్ 14న నామినేషన్లను స్కూటీని చేయనున్నారు. నామినేషన్ల విత్డ్రాలకు అక్టోబర్ 16 చివరి తేదీ. అక్టోబర్ 20న ఎన్నికల నిర్వహణతో పాటు అదేరోజు ఫలితాలను ప్రకటించనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ మాజీ ఐఏఎస్ అధికారి సంపత్ పేరుతో నోటిఫికేషన్ను విడుదల చేశారు.
అయితే హైదరాబాదులో ప్రపంచ కప్ మ్యాచ్ లు అక్టోబర్ 10తో ముగియనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం మూడు ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో రెండు పాకిస్తాన్ మ్యాచ్లే ఉండటం విశేషం. హైదరాబాదులో చివరి వరల్డ్ కప్ మ్యాచ్ అక్టోబర్ 10న పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరగనున్నాయి. ఈ మ్యాచ్ ముగిసిన పది రోజుల్లోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ కప్ సందర్భంగా హైదరాబాద్ లో మ్యాచ్ ల నిర్వహణ కోసం ఇప్పటికే బీసీసీఐ నుండి 117 కోట్ల రూపాయల నిధులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చేరాయి. నిధులు అందిన వెంటనే ఉప్పల్ స్టేడియాన్ని మరమ్మతులు చేశారు. గతంలో ఐపీఎల్ నిర్వహణ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీటింగ్ తో పాటు ఉప్పల్ స్టేడియంలో సరైన వసతులు లేవని విమర్శలు ఎక్కువగా వినిపించాయి. బిసిసిఐ నుండి ప్రపంచ కప్ కి ముందు నీధులు రావడంతో స్టేడియంలో మరమ్మతులు పూర్తి చేశారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..