AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Team: హైదరాబాద్‌ రుచులను ఆస్వాదిస్తున్న పాక్‌ ఆటగాళ్లు.. జ్యూవెల్ ఆఫ్ నైజాంలో డిన్నర్.. ఫ్యాన్స్‌తో సెల్ఫీలు..

Pakistan cricket team: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ ఇండియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పాక్‌ టీం.. వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతోంది. అయితే, ఓ వైపు పాకిస్థాన్‌ టీమ్‌ ఆటపై దృష్టి పెడుతూనే .. హైదరాబాద్‌ రుచులను ఎంజాయ్‌ చేస్తోంది. హైదరాబాద్‌ నగరంలోని టాప్‌ హోటళ్లలో పాక్‌ ఆటగాళ్లు రుచులను ఆస్వాదిస్తూ.. సందడి చేస్తున్నారు.

Pakistan Team: హైదరాబాద్‌ రుచులను ఆస్వాదిస్తున్న పాక్‌ ఆటగాళ్లు.. జ్యూవెల్ ఆఫ్ నైజాంలో డిన్నర్.. ఫ్యాన్స్‌తో సెల్ఫీలు..
Pakistan Cricket Team
Shaik Madar Saheb
|

Updated on: Oct 01, 2023 | 11:17 AM

Share

Pakistan cricket team: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ ఇండియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పాక్‌ టీం.. వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతోంది. అయితే, ఓ వైపు పాకిస్థాన్‌ టీమ్‌ ఆటపై దృష్టి పెడుతూనే .. హైదరాబాద్‌ రుచులను ఎంజాయ్‌ చేస్తోంది. హైదరాబాద్‌ నగరంలోని టాప్‌ హోటళ్లలో పాక్‌ ఆటగాళ్లు రుచులను ఆస్వాదిస్తూ.. సందడి చేస్తున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు శనివారం ‘జ్యూవెల్ ఆఫ్ నైజాం’లో డిన్నర్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్‌ చేసింది. హైదరాబాద్‌ నగరంలో గట్టి భద్రత మధ్య బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, ఇతర పాకిస్తానీ క్రికెటర్లు జ్యూవెల్ ఆఫ్ నైజాంకు వెళ్లి డిన్నర్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

‘జువెల్ ఆఫ్ నిజాం’ వద్ద తీసిన ఈ వీడియోలో పాక్‌ క్రికెట్ టీమ్‌.. హైదరాబాద్‌కు చెందిన VIIవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. పెయింటింగ్‌ను మెచ్చుకోవడం కూడా చూడవచ్చు.

వీడియో చూడండి..

హైదరాబాద్‌లోని ‘జ్యూవెల్ ఆఫ్ నైజాం’ గురించి ఆసక్తికర విషయాలు..

‘జ్యువెల్ ఆఫ్ నైజాం’ అనేది హైదరాబాదీ వంటకాలను అందించడానికి ప్రసిద్ధి చెందిన డైనింగ్ రూమ్. ఇది హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో ఉంది. ఆహార ప్రియులకు విలాసవంతమైన అనుభవాన్ని అందించడానికి ప్రసిద్ధి చెందిన ఈ డైనింగ్ రూమ్‌లో అనేక రకాల ప్రత్యేక వంటకాలను అందిస్తారు. ఈ హోటల్ మెనులో హైదరాబాద్‌ బీర్యానీతోపాటు అనేక రకాల వంటకాలు ఉంటాయి. ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో ఉంది.

హైదరాబాద్‌లోని రెస్టారెంట్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు విలాసవంతమైన విందును ఆస్వాదించడమే కాకుండా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.

హైదరాబాద్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌లు..

హైదరాబాద్‌లో పాకిస్తాన్ ODI ప్రపంచ కప్ 2023లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మొదటి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో అక్టోబర్ 6న, తర్వాత శ్రీలంకతో అక్టోబర్ 10న మ్యాచ్ జరుగుతుంది. తదనంతరం, అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న భారత్‌తో మ్యాచ్ కోసం జట్టు అహ్మదాబాద్‌కు వెళుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..