AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..ఆ నిబంధనలు సడలింపు..

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జలమండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఓటీఎస్ స్కీమ్ 2024 నిబంధనలను సడలింపు చేసింది. ఏం నిబంధనలు సడలింపు చేసిందంటే?

Telangana: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..ఆ నిబంధనలు సడలింపు..
Relaxation In Ots Norms
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 11, 2024 | 8:59 PM

Share

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు హైదరాబాద్ జలమండలి గుడ్ న్యూస్ చెప్పింది. వాటర్ బిల్లుల చెల్లింపు కోసం తీసుకొచ్చిన ఓటీఎస్ స్కీమ్ 2024 నిబంధనలను సడలింపు చేసింది. వినియోగ‌దారుల నుంచి భారీగా విజ్ఞప్తులు రావ‌డంతో జ‌ల‌మండ‌లి ప్రభుత్వం  OTS-2024 ప‌థ‌కం గ‌డువును అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు పొడిగించింది.  OTS-2024 కింద ప్రయోజనం పొందే ప్రక్రియను సులభతరం చేసే దిశగా.. ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించే నిబంధనను సడలించి.. దాని స్థానంలో హామీ పత్రం సమర్పించే వెసులుబాటును కల్పించింది. దీంతో OTS-2024 కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు అఫిడవిట్ స్థానంలో హామీ పత్రం సమర్పించవచ్చు.

గతంలో ఏ ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది. అయితే వినియోగదారుల నుంచి విజ్ఞప్తుల దృష్ట్యా ఇప్పుడు ఆ నిబంధనను సడలించారు. అర్హత ఉన్న కస్టమర్ మాత్రమే  పథకం ద్వారా 50% ప్రయోజనం పొందుతారు. గతంలో ఓటీఎస్ 2020 తప్పా ఏ ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందినా వినియోగదారులకు వంద శాతం రాయితీ పొందేలా ఆ షరతును సడలించింది.

ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేసి వాటిని నివృత్తి చేసుకోవచ్చు. ఈ పథకంపై అధికారులు ఇప్పటికే అన్ని మాధ్యమాల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. వినియోగదారుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు.. ఓటీఎస్ గడువును ప్రభుత్వం మరోసారి పెంచి.. నిబంధలను సైతం సవరించినట్లు జలమండలి ఎండీ అశోక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నిబంధనల సడలింపుతో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని జలమండలి అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు