South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్లాట్‌ఫాం టికెట్ ధరల తగ్గింపు
Railway News: ప్రయాణికులకు భారత రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా విజృంభణ సమయంలో పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలను
Railway Platform Ticket Prices: ప్రయాణికులకు భారత రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా విజృంభణ సమయంలో పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారం టికెట్ ధరలను తగ్గిస్తూ ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కాలంలో మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్లాట్ ఫాం ధరలను రైల్వేశాఖ పెంచిన విషయం తెలిసిందే. ప్రజల రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.50 గా చేశారు. అయితే.. తాజాగా అన్‌రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్, సాధరణ రైళ్లను పునరుద్ధరించారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం, సౌలభ్యం కోసం ప్లాట్ ఫాం ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా తాజాగా తగ్గించిన ధరల ప్రకారం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లల్లో ప్లాట్‌ఫారం టికెట్ ధర 10 రూపాయలుగా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే.. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం ప్లాట్‌ఫారం ధర 20 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.
Platform Ticket Fare reduced across all Stations of Secunderabad Division of SCR@RailMinIndia @drmsecunderabad pic.twitter.com/4imD4XK6hI
— South Central Railway (@SCRailwayIndia) July 26, 2021
Also Read: