సమ్మర్ ఎఫెక్ట్… ‘భగ్గుమంటున్న’ కరెంట్

హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం నమోదవుతోంది. మండుతున్న ఎండల ప్రభావానికి 24 గంటలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతున్నాయి. గ్రేటర్‌లో బుధవారం అత్యధికంగా 3391 మెగావాట్ల రికార్డు స్థాయి గరిష్ఠ డిమాండ్‌ నమోదయ్యింది. మంగళవారం 3324 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌తో పాటు 71.05 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం రికార్డయ్యింది. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో ఇప్పటి వరకు ఆల్‌టైం రికార్డుగా 71.05 ఎంయూల విద్యుత్‌ వినియోగం ఈ సంవత్సరం మే 28న నమోదయ్యిందని […]

సమ్మర్ ఎఫెక్ట్... 'భగ్గుమంటున్న' కరెంట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 30, 2019 | 6:02 PM

హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం నమోదవుతోంది. మండుతున్న ఎండల ప్రభావానికి 24 గంటలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతున్నాయి. గ్రేటర్‌లో బుధవారం అత్యధికంగా 3391 మెగావాట్ల రికార్డు స్థాయి గరిష్ఠ డిమాండ్‌ నమోదయ్యింది. మంగళవారం 3324 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌తో పాటు 71.05 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం రికార్డయ్యింది. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో ఇప్పటి వరకు ఆల్‌టైం రికార్డుగా 71.05 ఎంయూల విద్యుత్‌ వినియోగం ఈ సంవత్సరం మే 28న నమోదయ్యిందని విద్యుత్‌శాఖ అధికారులు ప్రకటించారు. గ్రేటర్‌లో 3500 మెగావాట్ల డిమాండ్‌ను సైతం ఎదుర్కొనేలా చర్యలు తీసుకున్నట్లు డిస్కం ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో గ్రేటర్‌లో గరిష్ఠ డిమాండ్‌ 2216 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 3391 మెగావాట్లకు విద్యుత్‌ డిమాండ్‌ చేరుకుంది.

ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం భారీగా పెరగడంతో విద్యుత్‌ వినియోగం రెట్టింపయ్యింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో గృహాలు, ఆఫీసుల్లో ఏసీలు, కూలర్ల వాడకం బాగా పెరిగింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో లోడ్‌ అమాంతంగా పెరిగి… పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయి. లోడ్‌ దెబ్బకు ఫీడర్లు ట్రిప్పవడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.