AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో ప్రభలంగా విస్తరిస్తున్న వ్యాధి.. బీ అలెర్ట్

హైదరాబాద్‌లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వర్షాకాలం మొదలు కాకముందే వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక్క నెలలోనే వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఫీవర్‌, గాంధీ ఆస్పత్రులకు పేషెంట్లు క్యూ కడుతున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో ప్రభలంగా విస్తరిస్తున్న వ్యాధి.. బీ అలెర్ట్
Hyderabad Patients
Ram Naramaneni
|

Updated on: Jun 18, 2024 | 6:30 PM

Share

ఇప్పుడిప్పుడే వర్షాకాలం మొదలైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అప్పుడే దోమలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో ఆస్పత్రులో ఇన్‌పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జ్వరాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత నెలరోజుల్లోనే నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి, సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వైరల్‌ ఫీవర్స్‌ బాధితులు క్యూ కట్టారు.

హైదరాబాద్‌ నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో ఇప్పటివరకూ 29 డెంగీ కేసులు వస్తే…సిటీలో మొత్తం వందకుపైగా కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలలో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు డెంగీ ఎఫెక్టు ఉంటుంది. కానీ ఈ సారి మే నుంచే డెంగీ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. PHCలు, బస్తీ దవాఖానాల్లో డెంగీ ర్యాపిడ్‌ కిట్లు, మందులు సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు.

మరోవైపు రానున్న వర్షాకాలంలో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని..లేదంటే, డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డెంగీ దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందన్నారు.

డెంగీ వచ్చాక జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకముందే…పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డెంగీ గురించి కొన్ని విషయాలు:

  • ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి
  • ఎడిస్‌ ఈజిప్టై దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ ప్రబలుతోంది. దీన్ని టైగర్ దోమ అని కూడా అంటారు
  • ఈ దోమలు పగటిపూటే కుడుతాయి
  • దోమ కుట్టిన ఐదు నుంచి ఎనిమిది రోజుల తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి
  • డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ.. మరొకరిని కుట్టినా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది
  • వర్షాకాలంలో డెంగ్యూ వేగంగా వ్యాప్తి చెందుతుంది
  • జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు-వికారం వంటి లక్షణాలు ఉంటాయి

ఇంట్లో దోమలు తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే దోమ తెరలను వినియోగించండి. శరీరంలోని అన్ని భాగాలకు రక్షణ కలిగే విధంగా దుస్తులు ధరించండి. ఇంట్లో కుండీల్లో, ఉపయోగించని టైర్లు వంటి వాటిలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..  

Follow Us