Hyderabad: పందులపై విచక్షణారహితంగా దాడి.. కట్ చేస్తే.. షాక్ ఇచ్చిన పోలీసులు!
మూగ జీవాలైన పందులపై దాడి చేసినందుకు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో చోటుచేసుకుంది. చికోటి గార్డెన్ సమీపంలో ఓ ఐదుగురు వ్యక్తులు పందులపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని గమనించిన ఓ స్థానిక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

వీళ్లకు ఏం ఏమైందిరాబాబు పందులపై విచక్షణారహితంగా దాడి చేశారు. అందులో ఒక పంది కడుపుతో ఉందని కూడా జాలి పడకుండా పైశాచికంగా వ్యవహరించారు. మే 15న బేగంపేటలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై జంతు ప్రేమికులు నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పందుల గుంపుపై దాడి చేసి హింసించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
బేగంపేట పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చికోటి గార్డెన్ నివాసితులలో ఒకరైన మహిళ మొదట ఒక గార్డు పందులపై రాళ్ళు విసురుతూ వాటిని ఆ ప్రాంతం నుండి తరిమికొట్టడాన్ని చూసింది. ఆమె వారించడంతో అతను పక్కకు వెళ్లిపోయాడు. అదే రోజు సాయంత్రం.. ఆమె ఇంట్లో ఉండగా.. పందుల అరుపులు వినిపించాయి. ఆమె బయటకు వచ్చేసరికి.. ఐదుగురు వ్యక్తులు పందులను వలలో పట్టుకుని వాటిపై దాడి చేయడం చూసింది. అంతేకాదు వాటి కాళ్లను కట్టేసి పారిపోకుండా విచక్షణారహితంగా కొట్టారు. దీంతో పందులు నోరు, ఇతర అవయవాల నుంచి రక్తం స్రావం జరిగింది. అంతేకాదు కడుపుతో ఉన్న పందిని అని కూడా చూడకుండా దాని గొంతుపై మోకాలిని నొక్కిపట్టి దాడి చేసినట్లు మహిళ వెల్లడించిందని పోలీసులు తెలిపారు.
ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించగా, ఆ వ్యక్తులు బైక్‌లపై అక్కడి నుండి పారిపోయారు. ఆ మహిళ నుండి వచ్చిన సమాచారం మేరకు, పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు. గాయపడ్డ పందులను జంతువుల సంరక్షణను చూసే ఓ NGOకి అప్పగించినట్లు తెలిసింది. సీసీటీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నామని బేగంపేట పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




