AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిండుగా హుస్సేన్ సాగర్: అప్రమత్తమవ్వాలన్న అధికారులు..!

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌కు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్‌కి వచ్చిన వాళ్లు కనీసం ఒక్కసారన్నా.. నక్లెస్‌రోడ్డులోని హుస్సేన్‌సాగర్‌ను చూడాలనుకుంటారు. అందులోనూ.. హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూంటాడు. హుస్సేన్ సాగర్‌లో బోటింగ్.. చేసి.. బుద్ధుడి వద్దకి వెళ్లి సెల్ఫీ తీసుకోవాలనుకుంటారు విహార యాత్రికులు. ప్రశాంతంగా.. అలా.. కొద్దిసేపైనా అక్కడ పర్యాటకులు సేద తీరుతూంటారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండు కుండలాగా మారింది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తోన్న వర్షాల […]

నిండుగా హుస్సేన్ సాగర్: అప్రమత్తమవ్వాలన్న అధికారులు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 02, 2019 | 2:02 PM

Share

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌కు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్‌కి వచ్చిన వాళ్లు కనీసం ఒక్కసారన్నా.. నక్లెస్‌రోడ్డులోని హుస్సేన్‌సాగర్‌ను చూడాలనుకుంటారు. అందులోనూ.. హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూంటాడు. హుస్సేన్ సాగర్‌లో బోటింగ్.. చేసి.. బుద్ధుడి వద్దకి వెళ్లి సెల్ఫీ తీసుకోవాలనుకుంటారు విహార యాత్రికులు. ప్రశాంతంగా.. అలా.. కొద్దిసేపైనా అక్కడ పర్యాటకులు సేద తీరుతూంటారు.

ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండు కుండలాగా మారింది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తోన్న వర్షాల కారణంగా.. హుస్సేన్ సాగర్ జలాశయంను తలపిస్తోంది. భారీ వర్షాలతో.. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. హుస్సేన్ సాగర్‌ జలకళను సంతరించుకుంది. దీంతో.. అధికారులు నీటిని తరలించాలని నిర్ణయించుకున్నారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తి వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పరీవాహక ప్రజలకు విషయం తెలియజేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా.. వినాయక చవితి సందర్భంగా.. 11 రోజులకు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఏటా పెద్ద ఎత్తున గణేషులను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. ఈ సారి ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్‌లో వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో.. నిమజ్జనానికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Officials to lift Gates of Hussain Sagar at any moment