Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు రద్దు.? రైల్వేశాఖ క్లారిటీ ఇదిగో

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ట్రైన్స్ రద్దు చేస్తున్నట్లు సమాచారం రావడంతో రైల్వే శాఖ స్పందించింది. కుంభమేళా స్పెషల్‌ ట్రైన్స్ రద్దు చేయలేదని.. చేయబోమంటూ రైల్వేశాఖ ప్రకటించింది. మరి ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి

Maha Kumbh: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు రద్దు.? రైల్వేశాఖ క్లారిటీ ఇదిగో
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 29, 2025 | 10:01 PM

ప్రయాగ్‌రాజ్‌కు జన ప్రవాహం పోటెత్తింది. ఎటుచూసినా జనమే జనం. ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ కనిపిస్తున్నారు. వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల జనం పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరి తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే శాఖ ట్రైన్స్ తగ్గించిందా? దీనికి సంబంధించి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

తొక్కిసలాట నేపధ్యంలో మహా కుంభమేళా స్పెషల్‌ ట్రైన్స్ రద్దు చేశారంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది రైల్వేశాఖ. కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు రద్దు చేయలేదని.. చేయబోమంటూ ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్‌ స్టేషన్‌ నుంచి 360 రైళ్లను నడుపుతున్ననట్లు వెల్లడించింది. కాగా, తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వీలైనన్ని ఎక్కువ రైళ్లు నడపాలని కేంద్ర మంత్రిని యోగి కోరారు. ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రతి 4 నిమిషాలకో ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటనలో తెలిపింది. అలాగే రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు మౌని అమావాస్య నాడు ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా జనసంద్రంగా మారింది. ఇవాళ ఒక్కరోజే 5 కోట్ల 4 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత సాధువుల అమృత్‌ స్నాన్‌ వైభవంగా తిరిగి ప్రారంభమయ్యింది. అధికారులకు సాధువులు , సంతువులు పూర్తిగా సహకరిస్తున్నారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు పుష్కర ఘాట్లకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. నాగ సాధువుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. పుష్కర ఘాట్లన్నీ స్వామీజీలతో నిండిపోయాయి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎస్‌‌‌‌‌‌కే‌‌ఎన్..
తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎస్‌‌‌‌‌‌కే‌‌ఎన్..
ఏరా.! మీరు మారరా.. రోడ్డుపై లగ్జరీ కార్లతో డెత్ స్టంట్‌లు
ఏరా.! మీరు మారరా.. రోడ్డుపై లగ్జరీ కార్లతో డెత్ స్టంట్‌లు
కాసులు కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. లక్షతో కోటీశ్వరులుగా
కాసులు కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. లక్షతో కోటీశ్వరులుగా
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం!
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం!
గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రి
గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రి
ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్‌, అమెరికా, దుబాయ్‌లో ధరలు?
ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్‌, అమెరికా, దుబాయ్‌లో ధరలు?
ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా
ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..
పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?
పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?
ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..!
ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..!