Hyderabad: సన్‌బర్న్‌కు అనుమతి ఇవ్వలేదు — పోలీసుల క్లారిటీ
సిటీలో ‘సన్‌బర్న్’ పేరిట నిర్వహించ తలపెట్టిన ఈవెంట్‌పై దుమారం రేగడంతో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి స్పందించారు. ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఈవెంట్‌కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది.

పేరు సన్ బర్న్ షో. మూడు పెగ్గులు.. ఆరు సిగరెట్స్‌లా సాగే షోలే ఇది. తాగినోడికి ఊగినంత పండుగ. సింపుల్‌గా చెప్పాలంటే తాగు.. ఊగు….అదే ఈ సన్ బర్న్. విదేశాల్లో ఫేమస్ అయిన ఈ షో…కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో కూడా ప్రతి న్యూ ఇయర్‌కి వెర్రి తలలు వేస్తోంది. యువతను వెర్రెక్కిస్తోంది. ఓవైపు ఆటా పాటా…మరోవైపు విచ్చలవిడిగా మద్యం, మత్తు పదార్థాల వాడకం సరేసరి. గంజాయ్ తాగుతూ ఎంజాయ్ చేసే కుర్రకారు. దమ్ మారో దమ్ అంటూ డ్రగ్స్ కైపుతో ఊగిపోయే యువత…ఇదంతా కలిస్తే సన్ బర్న్ షో. గతంలో ఈ వేడుకల్లో పాల్గొనడానికి మైనర్లు భారీగా తరలి వచ్చారు. పీకల దాకా తాగుతూ, తూలుతూ కనిపించారు. వీరిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. అప్పట్లో అది చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో సన్‌బర్న్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించేందుకు కొందరు ప్లాన్ చేశారు. మాదాపూర్‌లో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు షురూ చేశారు. ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా సేల్ కూడా పెట్టేశారు.
యువతను పెడదోవ పట్టిస్తున్న ఇలాంటి షోలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన నేపథ్యంలో….హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. టికెట్లు అమ్మి ఈవెంట్లు నిర్వహించే సన్‌బర్న్, బుక్‌మైషో వంటి సంస్థలకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి అని సైబరాబాద్ సీపీ మహంతి స్పష్టం చేశారు. ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, నిర్వహించేందుకు సన్‌బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. సన్‌బర్న్ షోకు అనుమతులు లేకుండా టికెట్లు విక్రయించినందుకు మాదాపూర్‌లో కేసు నమోదు అయింది. బుక్ మై షో, సన్‌బర్న్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకొని గట్టిగా మందలించినట్లు తెలిసింది.
ఇక ఆదివారం జరిగిన కలెక్టర్లు , ఎస్పీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి…న్యూ ఇయర్ వేడుకల కోసం నిర్వహించే ఈవెంట్లపై సీరియస్ అయ్యారు. ఈవెంట్ల నిర్వహణ, అనుమతులపై పోలీసు అధికారులకు డైరెక్షన్ ఇచ్చారు సీఎం. గోవా, మహారాష్ట్ర, కర్నాటక లాంటి స్టేట్స్…సన్‌బర్న్ ఈవెంట్లను రద్దు చేస్తే తెలంగాణలో అవి అవసరమా అన్నారు ముఖ్యమంత్రి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




