Telangana: కొత్త పింఛన్లకు ముహూర్తం నేడే.. వారికీ ఆసరా అందించాలని నిర్ణయం.. ఆదేశాలు జారీ
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం గతంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి కొత్తంగా పది లక్షల మంది పింఛన్లు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు అధికారులు అన్ని...
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం గతంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి కొత్తంగా పది లక్షల మంది పింఛన్లు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త ఆసరా పింఛన్ల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం నెలాఖరు వరకు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆసరా పింఛన్లతో పాటు ఆసరా కార్డులను కూడా పంపిణీ చేస్తామన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు కొత్త కార్డులుల పంపించారు. కాగా.. ఆసరా పింఛన్ల అర్హత వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకు పైగా అర్హత కలిగిన వ్యక్తులకు పింఛన్లు (Pensions) అందాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 35.95 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులకు ప్రభుత్వం నెల నెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. దివ్యాంగులకు నెలకు రూ.3,016, వృద్ధులు, వితంతువులు, ఇతర క్యాటగిరీల వారికి నెలకు రూ.2,016 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది.
ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తాం. కొత్తకార్డులను బార్‌కోడ్‌తో ఇస్తున్నాం. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పింఛన్లు 46 లక్షలకు చేరాయి. వీటికి సంబంధించిన ఆసరా కార్డులు అందిస్తాం. డయాలసిస్ రోగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే వారికి కూడా పింఛన్ ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది డయాలసిస్ రోగులు ఉన్నారు. వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కొనసాగిస్తూనే ఆసరా కార్డు కూడా ఇస్తాం. దీంతో వారికి ప్రతి నెలా రూ.2016 పింఛన్ అందుతుంది. బోదకాలు బాధితులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఘనత తెలంగాణదే.
– కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..