ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు నామినేషన్

శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. తెరాస నేత కె.నవీన్ రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున.. ఆయన ఎన్నిక లాంఛనంగా ప్రకటించడమే ఇక మిగిలింది. తెరాస నుంచి నవీన్ రావు బరిలో ఉండగా… ఈ ఎన్నికల్లో విపక్షాలు పోటీకి విముఖత చూపాయి. దీంతో ఇవాళ నామినేషన్ల గడువు ముగిసే సరికి నవీన్ రావు నామినేషన్ ఒక్కటి మాత్రమే దాఖలైంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు శాసనమండలికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎన్నికల […]

ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు నామినేషన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 28, 2019 | 6:43 PM

శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. తెరాస నేత కె.నవీన్ రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున.. ఆయన ఎన్నిక లాంఛనంగా ప్రకటించడమే ఇక మిగిలింది. తెరాస నుంచి నవీన్ రావు బరిలో ఉండగా… ఈ ఎన్నికల్లో విపక్షాలు పోటీకి విముఖత చూపాయి. దీంతో ఇవాళ నామినేషన్ల గడువు ముగిసే సరికి నవీన్ రావు నామినేషన్ ఒక్కటి మాత్రమే దాఖలైంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు శాసనమండలికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎన్నికల ప్రక్రియ చేపట్టారు.

మంగళవారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నవీన్ రావు రెండు సెట్ల నామినేషన్లు సమర్పించారు. నవీన్ రావు వెంట తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ నెల 31న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నవీన్ రావు ఎన్నికను లాంఛనంగా ప్రకటిస్తారు.