శ్రీరామనగరంలో ఆధ్యాత్మిక శోభ.. రెండో రోజు కొనసాగుతున్న శ్రీరామానుజాచార్యుల బ్రహ్మోత్సవాలు..
ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీభగవద్ రామానుజాచార్యుల నాలుగోవ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజు హోమశాలలో పెరుమాళ్ల ఆరాధన తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సాకేత రామాలయం దగ్గర ధ్వజారోహణం చేశారు. అనంతరం సమాతమూర్తి ప్రాంగణంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ ధ్వజారోహణ కార్యక్రమం విశిష్టత, గరుడ ప్రసాదం ప్రత్యేకతకు గురించి వివరించారు. సంతానం లేని వారికి గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందన్నారు.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీభగవద్ రామానుజాచార్యుల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చిన్నజీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో రామానుజాచార్యుల విగ్రహాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ జరిగింది. ఫిబ్రవరి 9 వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో.. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతాకుంభ్-2026 బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. శ్రీభగవద్ రామానుజాచార్యులతోపాటు.. 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామివారు అట్టహాసంగా శ్రీకారం చుట్టారు. చిన్నజీయర్‌స్వామివారి ఆధ్వర్యంలో వచ్చేనెల 9 వరకు శ్రీరామనగరంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగనున్నాయి. తొలిరోజు అంకురారోపణ కార్యక్రమం, శ్రీవిష్వక్సేన ఆరాధన జరిగింది. శ్రీభగవద్ రామానుజులస్వామి వారి బంగారు విగ్రహానికి చిన్నజీయర్‌స్వామివారు అభిషేకం చేశారు. సమతాకుంభ్-2026 ఉత్సవాలతో శ్రీభగవద్ రామానుజాచార్యులను స్మరించుకునేందుకు గొప్ప అవకాశం దక్కుతుందన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి..
2వ రోజు ధ్వజారోహణం, శేష వాహన సేవ..
ఇక.. సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఉదయం ధ్వజారోహణం ఉంటుంది. సంతానం లేనివారికి ఉచితంగా గరుడ ప్రసాదం అందజేయడంతోపాటు.. అగ్నిప్రతిష్ఠ, సూర్యప్రభవాహన సేవ, సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు శేష వాహన సేవ జరగనుంది. 3వ రోజు 18 దివ్యదేశమూర్తులకు తిరుమంజన సేవ, శ్రీరామ అష్టోత్తర శత నామార్చన ఉంటుంది. సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు చంద్ర వాహన సేవ నిర్వహిస్తారు. 4వ రోజు 18 దివ్యదేశమూర్తులకు తిరుమంజన సేవ, రామానుజ నూత్తందాది సామూహిక పారాయణం, సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవ ఉంటుంది.
- ఫిబ్రవరి 3న తిరుమంజన సేవ, డోలోత్సవం, గజ వాహన సేవ
- ఫిబ్రవరి 5న వసంతోత్సవం, అశ్వవాహన సేవ
- ఫిబ్రవరి 6న సామూహిక లక్ష్మీపూజ, గద్యత్రయ పారాయణం, సాగరుడ వాహన సేవ
- ఫిబ్రవరి 7న సువర్ణ రామానుజులకు ఆచార్య వరివస్య, తెప్పోత్సవం
- ఫిబ్రవరి 8న శ్రీ రామానుజుచార్యులకి రథోత్సవం, చక్రస్నానం
- ఫిబ్రవరి 9న శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహా పూర్ణాహుతి
- ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు 108 దివ్యదేశమూర్తులకు ఉత్సవాస్త స్నపనం
ఫిబ్రవరి 3న ఐదవ రోజు 18 దివ్యదేశమూర్తులకు తిరుమంజన సేవ, డోలోత్సవం, సాకేత రామచంద్ర ప్రభువుకు గజ వాహన సేవ జరుగుతుంది. ఫిబ్రవరి 4న ఆరవ రోజు సాయంత్రం ఐదు గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 5వ తేదీన 7వ రోజు వసంతోత్సవం, సాయత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు అశ్వవాహన సేవ జరుగుతుంది. ఫిబ్రవరి 6న 8వ రోజు సామూహిక లక్ష్మీ పూజ, గద్యత్రయ పారాయణం, సాకేత రామచంద్ర ప్రభువుకు గరుడ వాహన సేవ ఉంటుంది. ఫిబ్రవరి 7న సువర్ణ రామానుజులకు 108 దివ్యదేశాల మర్యాద సమర్పణలో భాగంగా ఆచార్య వరివస్య కార్యక్రమం, తెప్పోత్సవం కొనసాగనుంది. ఫిబ్రవరి 8న శ్రీ రామానుజుచార్యులకి రథోత్సవం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9.. చివరి రోజున శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహా పూర్ణాహుతి కార్యక్రమాలతో ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో శ్రీరామానుజుచార్యుల 4వ బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతాయి. ఆ తర్వాత.. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 13 వరకు 108 దివ్యదేశమూర్తులకు ఉత్సవాస్త స్నపనం జరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
