MEIL-World Heritage Day: ‘మేఘా‘ ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ దినోత్సవం.. బన్సీలాల్‌పేట్ స్టెప్‌వెల్‌లో వేడుకలు.. పూర్తి వివరాలివే
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకుంటారు. ప్రాచీన కట్టడాలు, స్మారక చిహ్నాలు, పలు ప్రదేశాల గుర్తింపుగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేసేలా.. ప్రపంచానికి చాటిచెప్పేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకుంటారు. ప్రాచీన కట్టడాలు, స్మారక చిహ్నాలు, పలు ప్రదేశాల గుర్తింపుగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేసేలా.. ప్రపంచానికి చాటిచెప్పేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా వరల్డ్ హెరిటేజ్ డేను ఘనంగా నిర్వహించేందుకు పలు సంస్థలు సంసిద్ధమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) కూడా వరల్డ్ హెరిటేజ్ డే నిర్వహించనుంది. కొన్నేళ్ల నుంచి ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) .. ఈ ఏడాది కూడా నిర్వహించేదుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం ప్రకటనను విడుదల చేశారు. సికింద్రాబాద్ లోని బన్సీలాల్‌పేట్ స్టెప్‌వెల్ (కోనేరు బావి – మెట్ల బావి) వద్ద 18 ఏప్రిల్ (గురువారం) సాయంత్రం ఆరు గంటలకు వరల్డ్ హెరిటేజ్ డే నిర్వహించనున్నట్లు మేయిల్ పేర్కొంది. దీనికి హాజరయ్యే వారు భారతీయ వస్త్రధారణను పాటించాలని పేర్కొంది.
మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రకటన..
వారసత్వం.. “వారసత్వం అనేది ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ మనకు వచ్చిన సంప్రదాయం.. ఈ రోజు మనం జీవిస్తున్నాము.. భవిష్యత్తు తరాలకు మనం ఏమి అందిస్తాము.” -యునెస్కో.. సందేశాన్ని పంచుకున్న మేయిల్.. మన దేశం సహజ సంపద, వైవిధ్యాన్ని స్వీకరించడం ద్వారా ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని స్మరించుకుందాం.. అంటూ ప్రకటనలో తెలిపింది.
- 18 ఏప్రిల్ 2024 సాయంత్రం 6:00 గంటలకు..
- స్థలం: బన్సీలాల్‌పేట్ స్టెప్‌వెల్ (బన్సీలాల్‌పేట్ మెట్ల బావి)
- డ్రెస్ కోడ్: ఇండియన్
బన్సీలాల్‌పేట్ స్టెప్‌వెల్ సాంప్రదాయ స్వాగత, మార్గదర్శక పర్యటనను ఆస్వాదించండి.. మంత్రముగ్ధులను చేసే “షణ్మత” ప్రదర్శనను తిలకించండి.. అంటూ మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రకటనలో వెల్లడించింది. SR (సుధారెడ్డి) -MEIL ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించే వరల్డ్ హెరిటేజ్ డే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని ప్రకటనలో తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..