తెలంగాణలో మీ-సేవ కేంద్రాలకు తాత్కాలిక బ్రేక్.. ఎందుకంటే

తెలంగాణలో మీ-సేవ కార్యాలయాలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవ కేంద్రాలు పనిచేయవు. ఈ విషయాన్ని నిజామాబాద్ జిల్లా ఈడీఎం కార్తీక్ ఓ ప్రకటనలో వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా మీ-సేవ సేవలు బంద్ అవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 13వ తేది రాత్రి 7గంటల నుంచి మీ సేవా సేవలు బంద్ అవ్వనుండగా.. 16వ తేది ఉదయం […]

తెలంగాణలో మీ-సేవ కేంద్రాలకు తాత్కాలిక బ్రేక్.. ఎందుకంటే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 13, 2019 | 3:23 PM

తెలంగాణలో మీ-సేవ కార్యాలయాలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవ కేంద్రాలు పనిచేయవు. ఈ విషయాన్ని నిజామాబాద్ జిల్లా ఈడీఎం కార్తీక్ ఓ ప్రకటనలో వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా మీ-సేవ సేవలు బంద్ అవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 13వ తేది రాత్రి 7గంటల నుంచి మీ సేవా సేవలు బంద్ అవ్వనుండగా.. 16వ తేది ఉదయం 8గంటలకు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అన్ని కార్యాలయాలకు ముందస్తు సమాచారం పంపామని.. మీ-సేవ నిర్వాహకులు కూడా ముందుగానే ఈ అంతరాయం గురించి ప్రజలకు వివరించాలని ఈఎండీ కార్తీక్ సూచించారు. అలాగే ఈ విరామ సమయానికి ప్రజలు కూడా సహకరించాలని కార్తీక్ కోరారు.