Watch: ఓర్నీ.. అప్పుడే గణపతిని ప్రతిష్టించారు.. ఇంతలోనే లడ్డూ దొంగతనం.. వీడియో
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది.. గణనాథుడు వాడవాడలా దర్శనమిస్తున్నాడు. నవరాత్రులపాటు పట్టణాలు, గ్రామాల్లో ఇదే సందడి నెలకొననుంది.. వినాయక నవరాత్రుల వేళ.. ఓ లడ్డు దొంగ రెచ్చిపోయాడు.. అవును మేం చెప్పింది.. నిజమే.. గణపతిని ప్రతిష్టించిన మొదటిరోజే లడ్డూ దొంగతనం జరిగింది..
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది.. గణనాథుడు వాడవాడలా దర్శనమిస్తున్నాడు. నవరాత్రులపాటు పట్టణాలు, గ్రామాల్లో ఇదే సందడి నెలకొననుంది.. వినాయక నవరాత్రుల వేళ.. ఓ లడ్డు దొంగ రెచ్చిపోయాడు.. అవును మేం చెప్పింది.. నిజమే.. గణపతిని ప్రతిష్టించిన మొదటిరోజే లడ్డూ దొంగతనం జరిగింది.. ఉదయం గణపతి పూజ జరగగా.. అర్ధరాత్రి ఓ వ్యక్తి లడ్డూను దొంగతనం చేసి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..
గణేష్ మండపంలో లడ్డూ దొంగతనం జరిగిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో శనివారం వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అయితే.. అర్థరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఓ దొంగ వినాయక మండపంలోకి ప్రవేశించి, గణేషుడి చేతిలోని లడ్డు తీసుకొని ఉడాయించాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది..
వీడియో చూడండి..
బడా గణేషుడిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్న భక్తులు..
ఖైరతాబాద్ గణేష్‌కి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో… బడా గణేషుని దర్శించుకునేందుకు సిటీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వామి దర్శనం కోసం క్యూలైన్లో నిల్చుంటుంటున్నారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని రూట్లలో ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.