AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హోటల్‌లో దిగిన 9 మంది అమ్మాయిలు.. అనుమానం వచ్చి ఆరా తీయగా.. ఓర్నాయనో..

వాళ్లంతా వేరే దేశాలు, రాష్ట్రాలకు చెందిన యువతులు.. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్నారు.. అక్కడ పనిచేస్తున్నారనుకుంటే.. పొరబడినట్లే.. వాళ్లను ఇక్కడకు తీసుకువచ్చిన కొంతమంది.. వ్యభిచారం కూపంలోకి దించి డబ్బులు దంటుకుంటున్నారు.. వీళ్లంతా చిన్న ముఠా అనుకునేరు.. ఇంటర్నేషనల్ హైటెక్ గ్యాంగ్.. ఏకంగా.. హోటల్ యాజమాన్యంతోనే డీల్ కుదుర్చుని.. చీకటి దందా కొనసాగిస్తున్నారు.

Hyderabad: హోటల్‌లో దిగిన 9 మంది అమ్మాయిలు.. అనుమానం వచ్చి ఆరా తీయగా.. ఓర్నాయనో..
Hyderabad Prostitution racket busted
Shaik Madar Saheb
|

Updated on: Aug 15, 2025 | 8:58 AM

Share

వాళ్లంతా వేరే దేశాలు, రాష్ట్రాలకు చెందిన యువతులు.. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్నారు.. అక్కడ పనిచేస్తున్నారనుకుంటే.. పొరబడినట్లే.. వాళ్లను ఇక్కడకు తీసుకువచ్చిన కొంతమంది.. వ్యభిచారం కూపంలోకి దించి డబ్బులు దంటుకుంటున్నారు.. వీళ్లంతా చిన్న ముఠా అనుకునేరు.. ఇంటర్నేషనల్ హైటెక్ గ్యాంగ్.. ఏకంగా.. హోటల్ యాజమాన్యంతోనే డీల్ కుదుర్చుని.. చీకటి దందా కొనసాగిస్తున్నారు. యాంటీ హూమన్ ట్రాఫికింగ్ యూనిట్ దాడుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి.. ఉజ్బెకిస్థాన్, తుర్కమేనిస్తాన్ దేశాలు సహా.. మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అంతర్జాతీయ ముఠాను సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితులతోపాటు.. విటులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇంకా 9 మంది యువతులను రక్షించారు. నిందితులు.. మాదాపూర్‌లోని బీఎస్‌ఆర్‌ సూపర్‌ లగ్జరీ హోటల్‌ సిబ్బందితో చేతులు కలిపి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్‌ డీసీపీ కరణం సృజన గురువారం పేర్కొన్నారు. నిందితులు, విటులతో కలిపి ఏడుగుర్ని అరెస్టు చేశామన్నారు. అలాగే.. 9 మంది యువతుల్ని రక్షించినట్లు తెలిపారు. కొన్ని వెబ్‌సైట్ల ద్వారా వ్యభిచారం దందా చేస్టున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

నాంపల్లికి చెందిన హమీర్‌సింగ్‌ అలియాస్‌ అమీద్‌ సింగ్‌.. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిఖిల్, సోనియాసింగ్, విశాల్‌ భయ్యా, శృతి, రోహిత్, రమేశ్‌ తదితరులతో కలిసి వ్యభిచార దందా చేయిస్తున్నాడన్నారు. పలు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు, తుర్కమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌ తదితర దేశాలకు చెందిన యువతులను ఇక్కడికి రప్పించి.. వ్యభిచారం కూపంలోకి నెట్టేస్తున్నారన్నారు. ఈ చీకటి వ్యాపారం సజావుగా సాగించేందుకు మాదాపూర్‌ గాయత్రీనగర్‌లోని బీఎస్‌ఆర్‌ హోటల్‌లో సూపర్‌వైజర్లుగా పనిచేసే వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన తమ్మి శ్రీనివాస్, కడప జిల్లాకు చెందిన పోకల వెంకటేశ్వర్లుతో మాట్లాడుకుని.. కస్టమర్ల కోసం ఇదే హోటల్‌లో గదులు బుక్‌ చేయిస్తున్నారని తెలిపారు. ఈ వ్యభిచారానికి సహకరించినందుకు శ్రీనివాస్, వెంకటేశ్వర్లుకు కమీషన్‌ ఇస్తున్నారని.. తెలిపారు.

ఈ క్రమంలోనే.. నాలుగు రోజుల క్రితం కొన్ని వెబ్‌సైట్లలో కస్టమర్లు సంప్రదించగా ఇద్దరు విదేశీయులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది యువతుల్ని రప్పించి.. గదులు బుక్‌ చేయించారన్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్‌ ఏహెచ్‌టీయూ విభాగం హోటల్‌లో తనిఖీలు చేయగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయన్నారు. తొమ్మిది మంది యువతులతోపాటు.. హమీర్‌సింగ్, తమ్మి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్‌ తూము, ఆకాశ్‌ బజాజ్, మహ్మద్‌ వసీమ్, పార్థిబన్‌ తదితరులు దొరికారని..తెలిపారు. నిందితులందరినీ.. పోలీసులు మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించామని.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..