హైకోర్టుకెక్కిన ‘కొండా’.. ఎక్కడ..?

ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించడంతో.. తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఇటీవల ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలి ప్రాంతంలో తనిఖీల్లో దొరికిన రూ.10లక్షల విషయమై.. నోటీసులు ఇచ్చేందుకు ఆ ప్రాంత ఎస్‌ఐ తన సిబ్బందితో విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన తన అనుచరులతో పోలీసులను నిర్బంధించారు. దీనిపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కొండా […]

హైకోర్టుకెక్కిన ‘కొండా’.. ఎక్కడ..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 26, 2019 | 1:40 PM

ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించడంతో.. తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఇటీవల ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలి ప్రాంతంలో తనిఖీల్లో దొరికిన రూ.10లక్షల విషయమై.. నోటీసులు ఇచ్చేందుకు ఆ ప్రాంత ఎస్‌ఐ తన సిబ్బందితో విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన తన అనుచరులతో పోలీసులను నిర్బంధించారు. దీనిపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కొండా ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. కోర్టు దానిని కొట్టివేసిన విషయం తెలిసిందే. కాగా ఘటన జరిగినప్పటి నుంచి కొండా పరారీలో ఉండగా.. ఆయన కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు.