AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘పవర్‌’ఫుల్ ఎంట్రీ పక్కా.. తెలంగాణ ఎన్నికల్లో పవన్ ప్రచారం అప్పుడే..

తెలంగాణ దంగల్‌లో బీజేపీ-జనసేన అభ్యర్థుల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ఎంట్రీ ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు 8 స్థానాల్లో మిత్రపక్షంతో కలిసి బరిలో దిగినా.. ప్రచారానికి మాత్రం ప్రధాన నాయకుడు పత్తాలేకుండా పోయారు. జనసేనాని తెలంగాణ ఎన్నికల్లో వారాహి ప్రచార యాత్ర చేస్తారా.? లేదా.? అనే దానిపై క్లారిటీ వచ్చినట్టే..

Telangana: 'పవర్‌'ఫుల్ ఎంట్రీ పక్కా.. తెలంగాణ ఎన్నికల్లో పవన్ ప్రచారం అప్పుడే..
Janasena Chief Pawan Kalyan
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 21, 2023 | 5:31 PM

Share

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ దంగల్‌లో బీజేపీ-జనసేన అభ్యర్థుల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ఎంట్రీ ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు 8 స్థానాల్లో మిత్రపక్షంతో కలిసి బరిలో దిగినా.. ప్రచారానికి మాత్రం ప్రధాన నాయకుడు పత్తాలేకుండా పోయారు. జనసేనాని తెలంగాణ ఎన్నికల్లో వారాహి ప్రచార యాత్ర చేస్తారా.? లేదా.? అనే దానిపై క్లారిటీ వచ్చినట్టే ఉంది.

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన బరిలోకి దిగింది. బీజేపీ అగ్రనేతలంతా రాష్ట్రానికి వచ్చి.. ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నా.. జనసేన అధినేత మాత్రం ప్రచారానికి మొహం చాటేశారు. ప్రధాని మోదీతో కలిసి ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు తప్పితే.. ఇప్పటివరకు ఎన్నికల రణరంగంలో ప్రత్యక్ష ప్రచారానికి పవర్‌స్టార్ ఎంట్రీ కరువైంది. తెలంగాణలో 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంటోంది. చివరి వారంలో జనసేనాని పవర్‌ఫుల్ ఎంట్రీ ఉంటుందని ఆ పార్టీ అభ్యర్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జనసేనతో కలిసి వెళ్తే మద్ధతుదారులే కాదు.. పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్‌గా తమకు కలిసి వస్తారని బీజేపీ భావిస్తోంది. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో పవన్ రోడ్ షోలు, బహిరంగ్ సభల్లో పాల్గొంటే అడ్వాంటేజ్ ఉంటుందని ఆశపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ సీట్ల పంపిణీ వరకే బీజేపీ నేతలతో చర్చలు జరిపి 8 సీట్లు కేటాయించేలా చేసుకున్నారు. ఆ తర్వాత అభ్యర్థులను మిత్రపక్షానికి వదిలేసి ప్రచారం అంటే పట్టనట్టు జనసేన అధినేత తీరు ఉంది.

ఈ నెల 23 నుంచి జనసేన అధినేత తెలంగాణ ఎన్నికల కదన రంగంలో ప్రచారాన్ని హోరెత్తిస్తారని తెలుస్తోంది. ఈ నెల 23న నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరపున జనసేనాని ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలిపారు. అదే రోజు వరంగల్‌లోనూ బీజేపీ అభ్యర్థిని బలపరూస్తు రోడ్ షోలో పాల్గొంటారని సమాచారం అందుతోంది. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ తరపున పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ క్యాంపెయిన్ చేయబోతున్నారు. 26న కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని పవన్ ప్రచారం చేయబోతున్నారట. అధికారికంగా జనసేన పవన్ ప్రచార షెడ్యూల్ ఖరారు చేయకున్నా.. ఇద్దరు అభ్యర్థులకు మాత్రం 25, 26 తేదిల్లో ప్రచారానికి వస్తారని సమాచారం ఇచ్చారు.

దీంతో పవన్ ఎంట్రీతో తమకు మరింత బలం చేకూరుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఈ మూడు రోజుల ప్రచారంతో చివరి వారంలో పవన్ కళ్యాణ్‌ను అమిత్ షాతో కలిపి వివిధ రోడ్ షోలు, సభల్లో ప్రచారం చేయించాలని మిత్రపక్షమైన బీజేపీ కోరుకుంటోంది. బీజేపీ అభ్యర్థుల తరపున కూడా పవన్ క్యాంపెయిన్ ఉంటుందా.? లేదా.? జనసేన ఇద్దరు అభ్యర్థులకే పరిమితం అవుతారా అనేది చూడాలి. ఈ ఎన్నికల్లో ప్రచారానికి పవర్‌స్టార్ పవర్‌పుల్ ఎంట్రీ కోసం తెలంగాణ జనసైనికులంతా వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..