గీతగోవిందం నిర్మాతల ఆఫీసుల్లో ఐటీ సోదాలు

గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అయితే, వసూళ్లను తక్కువగా చూపారనే అనుమానం వ్యక్తం చేసిన ఆదాయపు పన్ను శాఖ గీతగోవిందం నిర్మాతల ఆఫీసుల్లో శుక్రవారం సోదాలు నిర్వహించింది. బంజారాహిల్స్‌లోని ‘జీఏ 2 పిక్చర్స్‌’ కార్యాలయానికి చేరుకున్న ఐటీ యూనిట్‌-14 బృందం అక్కడ సినిమా వసూళ్లకు సంబంధించిన వివరాలు, రికార్డులను పరిశీలించింది. దీని కలెక్షన్లు దాదాపు రూ.130 కోట్ల వరకు ఉంటుందని భావించిన ఐటీ అధికారులు, […]

గీతగోవిందం నిర్మాతల ఆఫీసుల్లో ఐటీ సోదాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2019 | 11:21 AM

గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అయితే, వసూళ్లను తక్కువగా చూపారనే అనుమానం వ్యక్తం చేసిన ఆదాయపు పన్ను శాఖ గీతగోవిందం నిర్మాతల ఆఫీసుల్లో శుక్రవారం సోదాలు నిర్వహించింది.

బంజారాహిల్స్‌లోని ‘జీఏ 2 పిక్చర్స్‌’ కార్యాలయానికి చేరుకున్న ఐటీ యూనిట్‌-14 బృందం అక్కడ సినిమా వసూళ్లకు సంబంధించిన వివరాలు, రికార్డులను పరిశీలించింది. దీని కలెక్షన్లు దాదాపు రూ.130 కోట్ల వరకు ఉంటుందని భావించిన ఐటీ అధికారులు, పన్ను చెల్లింపుల విషయమై ఆరా తీశారు. ఈ అంశంపై అక్కడ సిబ్బందితో పాటు నిర్మాణ సంస్థ యాజమాన్యాన్ని వారు ప్రశ్నించారు. సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత? పన్ను సక్రమంగా చెల్లించారా? లేదా అన్న వివరాలపై ఆరా తీస్తూ, నిర్మాతలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇదే నిర్మాణ సంస్థ గతంలో నిర్మించిన రెండు సినిమాలకు సంబంధించిన రికార్డులను కూడా ఐటీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. జీఏ-2 పిక్చర్స్ బ్యానర్‌‌ను స్థాపించిన బన్నీ వాసు గీతగోవిందం, టాక్సీవాలా చిత్రాలను నిర్మించారు.