Hyderabad: సీసీటీవీ కెమెరాల నిఘాలో హైదరాబాద్ సురక్షితమేనా? కీలక కేసుల విషయంలో జాప్యం ఎందుకు..?
Hyderabad News: విశ్వ నగరం హైదరాబాద్‌లో దాదాపు ఐదు లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. నగరంలో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా.. ఒక రకంగా చెప్పాలంటే చీమ చీటిక్కుమన్నా ఇట్టే పట్టుకుంటామంటూ రాష్ట్ర హోం మంత్రిని మొదలుకొని.. కిందిస్థాయి కానిస్టేబుల్ వరకు తరచూ చెప్పే మాట ఇది. కానీ వాస్తవానికి పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. బ్రాండ్ హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ హైదరాబాద్‌లో ఈ పరిస్థితికి కారణం ఏంటి..?
హైదరాబాద్: విశ్వ నగరం హైదరాబాద్‌లో దాదాపు ఐదు లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. నగరంలో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా.. ఒక రకంగా చెప్పాలంటే చీమ చీటిక్కుమన్నా ఇట్టే పట్టుకుంటామంటూ రాష్ట్ర హోం మంత్రిని మొదలుకొని.. కిందిస్థాయి కానిస్టేబుల్ వరకు తరచూ చెప్పే మాట ఇది. కానీ వాస్తవానికి పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. బ్రాండ్ హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ హైదరాబాద్‌లో ఈ పరిస్థితికి కారణం ఏంటి..?
కమ్యూనిటీ పోలీసింగ్ పేరిట దాదాపు 5 లక్షల సీసీ కెమెరాలు హైదరాబాద్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్నాయి.హైదరాబాదులో ఏ ఇన్సిడెంట్ జరిగిన సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాయంటూ పెద్ద ఎత్తున పోలీసులు ప్రచారం చేశారు. సీసీటీవీ కెమరాల సాయంతో ఏ మూల ఎలాంటి నేరం జరిగినా నిందితులును గంటల వ్యవధిలో పట్టేస్తామని పోలీసు అధికారులు చెబుతుంటారు. ఇలా పలు కేసులను పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గత 15 రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న వరుస దారుణాల కారణంగా సీసీ కెమెరాలు పనితీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
15 రోజుల్లో 5 హత్యలు 4 కిడ్నాప్ లు
ఒకవైపు హత్యలు, మరోవైపు కిడ్నాప్‌లు, వరుస యాక్సిడెంట్లతో హైదరాబాద్ రక్తపాతం ఎక్కువైంది. హైదరాబాదులో గడిచిన 15 రోజుల్లో ఆరు హత్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మూడు హత్యలు, సైబరాబాద్ లో మూడు హత్యలు, రాచకొండలో వరుస కిడ్నాప్ ఘటనలు కలకలం రేపాయి. హయత్ నగర్ లో నాలుగేళ్ల చిన్నారి కిరాణా షాప్ కు వెళ్తే ఆమెపైన అత్యాచారానికి ప్రయత్నించి కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. అమ్మాయి తప్పించుకోవడంతో నిందితుడు ఇంతవరకు దొరకలేదు. నిందితులు విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా నిందితుని ఆచూకీ పోలీసులకు దొరకలేదు.
తాజాగా ఘట్కేసర్ లో జరిగిన మరొక కిడ్నాప్ ఘటన కూడా ఇదే రకంగా ఉంది. కృష్ణవేణి అనే నాలుగేళ్ల పాప బయట ఆడుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి పారిపోతుండగా సీసీ కెమెరాల రికార్డు అయింది. రాత్రి 8 గంటల సమయంలో పాప మిస్ అయితే ఉదయం 11 గంటల వరకు కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సురేష్ అనే వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుంటే పాప కృష్ణవేణి కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమయ్యింది. వేలాది సీసీ కెమెరాల ఫూటేజీని నగర పోలీసులు విశ్లేషించినా.. కిడ్నాప్ తర్వాత నిందితుడి కదలికలను కనుక్కోలేకపోయారు.
నో విజబుల్ పోలీసింగ్
ఈ రకంగా హైదరాబాదులో గత 15 రోజులుగా జరుగుతున్న వరుస హత్యలు, వరుస కిడ్నాప్ లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 5 లక్షల సీసీ కెమెరాలతో హైదరాబాద్ సురక్షితంగా ఉందంటూ ఒకవైపు పోలీసులు చెబుతున్నా.. అదే సీసీ కెమెరాల్లో రికార్డు అయినప్పటికీ కూడా నిందితులు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని కేసుల విషయంలో కేవలం సీసీ కెమెరాలను మాత్రమే నమ్ముకుని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు.. హ్యూమన్ ఇంటెలిజెన్స్‌కు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం దర్యాప్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయన్నది అన్నది వాస్తవం. కొన్ని చోట్ల సీసీ కెమరాలు ఉన్నా వాటిపై పర్యవేక్షణ కొరవడడంతో అవి పనిచేయకపోవడం కొన్ని సందర్భాల్లో పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
మరిన్ని హైదరాబాద్ వార్తలు చదవండి..