Tollywood in 2025: 2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2024 గతంలోకి వెళ్లింది. ఆ సంవత్సరం జరిగిన ఇష్యూలు.. రిలీజ్ అయిన సినిమాలు.. ఆ సినిమా కలెక్షన్లు.. రికార్డులు అన్నీ గతమైపోయాయి. హిస్టరీకెక్కాయి. ఇక ఈ క్రమంలోనే 2025 వచ్చేసింది. అయితే కొత్త సంవత్సరం అలా వచ్చిందో లేదో.. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు అలెర్ట్ అయిపోయారు. తమ అప్‌కమింగ్ సినిమాలతో.. 2025లో రికార్డ్ లెవల్ కలెక్షన్స్ నమోదు చేసుందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకు సంక్రాంతి పర్వదినాన్ని ఫిక్స్ చేసుకుని.. అక్కడి నుంచి వరుసగా తమ సినిమాలను వదులుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, యువ దర్శకుడు అనిల్ రావిపూడిలది సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాళ్లిద్దరి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. ‘ఎఫ్ 2’ – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, అండ్ ‘ఎఫ్ 3’ ఈ రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆ రెండిటినీ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మూడో సినిమాగా రూపొందుతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం..! ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి రేసులో ఉంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో వన్ ఆఫ్ ది హాట్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. భీమ్స్ ఇచ్చిన మాస్ సాంగ్స్ తెలుగు టూ స్టేట్స్‌లో గట్టిగానే వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ పార్టీలోనూ సంక్రాంతికి వస్తున్నాం పాటలే సందడి చేశాయి. దీంతో ఈ సినిమా పై బజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ జనవరి 14 వైపే ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు విక్టరీ ఫ్యాన్స్ చూపుంది.
ఇక ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ కూడా దిగిపోతున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా జనవరి 10, 2025న వరల్డ్ వైడ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ మూవీ నుంచి తమన్ కంపోజ్ చేసిన పాటలు కూడా రిలీజ్ అయి మంచి హిట్ ట్రాక్స్ గా అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫాంలలో ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు జక్కన్న చేతిల మీదుగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంది. శంకర్ మార్క్ సినిమాగా.. చరణ్ హై పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా ఈ సినిమా ట్రైలర్ త్రూ అర్థం అయిపోతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.