TOP 9 ET: దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! | తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది.?

TOP 9 ET: దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! | తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది.?

Anil kumar poka

|

Updated on: Jan 03, 2025 | 11:36 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గేమ్‌ ఛేంజర్‌కు పోటీగా.. సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య డాకు మహరాజ్ సినిమా.. అప్పుడే కలెక్షన్ల ఖాత తెరిచేసింది. ఈమూవీ థియేట్రికల్ బిజినెస్ నెవర్ ఎవర్ అన్నట్టుగా జరిగిపోయిందట. ఆంధ్ర మొత్తంగా డాకు మహారాజ్ ను రూ. 40 కోట్ల రేషియోలో బిజినెస్ చేస్తున్నారు మేకర్స్. ఇక నందమూరి అడ్డాగా పిలిచే సీడెడ్ ఏరియా బిజినెస్ కూడా భారీగా జరిగిందట.

01.charn remunaration: దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌!

ఒకప్పటిలా కాదు.. ఇప్పుడు హీరోలు, ప్రొడ్యూసర్లు కమర్షియల్‌ గా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నీకెంత.. నాకింత అంటూ.. లెక్కలేస్తున్నారు. అయితే ఇలాంటి జమానాలో కూడా.. చరణ్ మాత్రం తన తండ్రిలాగే ప్రొడ్యూసర్‌ బాగోగుల గురించి ఆలోచిస్తున్నాడు. రీసెంట్‌ గా గేమ్ ఛేంజర్‌ విషయంలోనూ దిల్ రాజు కోసం వెనక్కి తగ్గాడు. ఎక్కువ రోజుల షూటింగ్ అవడంతో.. గేమ్ ఛేంజర్ బడ్జెట్ 500 కోట్లకు చేరింది. దీంతో ప్రొడ్యూసర్ వెల్‌ ఫేర్ ఆలోచించిన చెర్రీ.. తన రెమ్యునరేషన్‌ను 100 కోట్ల నుంచి 65 కోట్లకు తగ్గించుకున్నారట. అంత మొత్తం ఇస్తే చాలంటూ దిల్ రాజుకు చెప్పారట. అయితే ఇదే ఇప్పుడు ఫిల్మ్ సిటీలో చక్కర్లు కొడుతున్న వైరల్ టాక్.

02.balayya: డాకు మహరాజ్ ఊచకోత రిలీజ్‌కు ముందే రూ.40 కోట్ల బిజినెస్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గేమ్‌ ఛేంజర్‌కు పోటీగా.. సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య డాకు మహరాజ్ సినిమా.. అప్పుడే కలెక్షన్ల ఖాత తెరిచేసింది. ఈమూవీ థియేట్రికల్ బిజినెస్ నెవర్ ఎవర్ అన్నట్టుగా జరిగిపోయిందట. ఆంధ్ర మొత్తంగా డాకు మహారాజ్ ను రూ. 40 కోట్ల రేషియోలో బిజినెస్ చేస్తున్నారు మేకర్స్. ఇక నందమూరి అడ్డాగా పిలిచే సీడెడ్ ఏరియా బిజినెస్ కూడా భారీగా జరిగిందట. ఇక నైజాంలో ఈ సినిమా రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారు. ఓవర్సీస్ లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమను రిలీజ్ చేస్తున్నాయి.

03. BONEY KAPOOR: తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది.?

దక్షిణాది ప్రేక్షకులకు సినీ తారలపై అభిమానం ఎక్కువన్నారు బోనీకపూర్‌. పెద్ద హీరోల సినిమాల రిలీజులప్పుడు థియేటర్లకు విపరీతంగా అభిమానులు వస్తారన్నారు. సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ని నిందించాల్సిన అవసరం లేదన్నారు.

04.GAME CHANGER: సెన్సార్‌ ఎఫెక్ట్ బయటికి వచ్చిన రామ్ చరణ్ సినిమా టాక్

రామ్‌చరణ్‌ హీరోగా నటించిన సినిమా గేమ్‌ చేంజర్‌. శంకర్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ప్రమోషన్స్ కూడా షూరూ అయ్యాయి. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్ యు / ఎ సర్టిఫికెట్‌ జారీ చేసింది. 2 గంటల 45 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా అప్పుడే హిట్ టాక్ తెచ్చుకుంది. సెన్సార్ టాక్ పాజిటివ్‌గా రావడంతో ఆ మాట బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది.

05.MARCO: లీకర్ల దెబ్బకు.. వేడుకున్న మార్కో హీరో.

ఒప్పుకున్న సినిమా కోసం హీరోలు ఓ రేంజ్లో కష్టడతారు. బొమ్మ హిట్టై.. థియేటర్లో ఓ రేంజ్‌లో ఆడితే.. తమ కష్టాన్ని మరిచిపోయి మరీ.. ఎంజాయ్‌ చేస్తారు. అయితే అలా ఎంజాయ్‌ చేసే లోపే.. మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌కు బిగ్ ఝలక్ ఇచ్చారు లీకర్లు. స్టిల్ థియేటర్స్‌లో సూపర్ హిట్ టాక్‌తో.. హౌస్ ఫుల్ బోర్డులతో రన్ అవుతున్న తన లేటెస్ట్ మూవీ మార్కోను పైరసీ చేసి నెట్టింట పెట్టారు. ఇది చూసి హీరో.. ప్రస్తుతం తాము నిస్సహాయ స్థితలో ఉన్నామన్నారు. ప్రేక్షకులు అనుకుంటే పైరసీని అరికట్టగలరని.. తమ సినిమాను థియేటర్లోనే చూడాలని ప్రేక్షకులను వేడుకున్నాడు.

06.NTR Neel: సలార్2 కంటే ముందే కలుద్దాం!

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. సలార్ 2 కంటే ముందే దీన్ని పూర్తి చేయనున్నారు నీల్. ఈ క్రమంలోనే తాజాగా సినిమా షూటింగ్‌పై మరోసారి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ పుట్టినరోజు సందర్భంగా తారక్‌ను కలిసింది చిత్రయూనిట్.

07.Pushpa 2: పుష్ప 2 మరో రికార్డ్

పుష్ప 2 రికార్డులకు ఇప్పట్లో చెక్ పడేలా కనిపించడం లేదు. ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఏకంగా 15 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. క్లాస్, మాస్ ఆడియన్స్ ఈ సినిమా విజయాన్ని ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లకు అతి చేరువలో ఉంది పుష్ప 2. ఈ రికార్డు నేడో రేపో అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

08.Tillu 3: టిల్లు గాడు మళ్లొస్తున్నాడు.

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డిజే టిల్లు ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇందులో మూడో భాగం కూడా సిద్ధమవుతుందని తెలిపారు నిర్మాత నాగవంశీ. సిద్ధుతో తమ ర్యాపో బాగా సెట్ అయ్యిందని.. దీంతో ‘టిల్లు-3’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొందని తెలిపారీయన. ఈ సినిమాపై వర్క్ స్టార్ట్ అయ్యిందని.. ప్రస్తుతం కథకు సంబంధించిన స్టోరీ వర్క్ నడుస్తోందని నాగవంశీ తెలిపారు.

09.VidamuyarchiL: చరణ్‌కు అడ్డే లేదక్కడ.. పక్కకు తప్పుకున్న స్టార్ హీరో.!

అజిత్, త్రిష జంటగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న సినిమా విడాముయార్చి. ఈ సినిమా పొంగల్‌కు విడుదలవుతుందని ఇదివరకే ప్రకటించారు దర్శక నిర్మాతలు. అయితే తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. దీంతో గేమ్‌ ఛేంజర్ కు కోలీవుడ్‌లో పోటీ లేకుండా పోయినట్టైంది.

10.Akhil: సైలెంట్‌గా పని కానిస్తున్న అఖిల్

వరస ఫ్లాపుల నేపథ్యంలో నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు అఖిల్. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో కొత్త సినిమాకు సైలెంట్‌గా ముహూర్తం పెట్టారు అఖిల్. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్‌లో ఈ చిత్ర షూటింగ్ సైలెంట్‌గా ప్రారంభమైందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jan 03, 2025 11:36 AM