మజ్జిగలో ఇది ఒక్కస్పూన్ కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు.. బొడ్డు చుట్టూ కొవ్వు కొవ్వొత్తిలా కరగాల్సిందే..!
శరీరానికి శక్తినిచ్చి మానసిక స్థితిని సరిచేయడానికి ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మజ్జిగ గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. మజ్జిగను కొందరు వేసవిలోనే తీసుకోవాలనుకుంటారు..కానీ, ఏడాది పొడవునా మజ్జిగ తీసుకుంటే శరీరానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, మజ్జిగలో ఒక్క స్పూన్ ఈ రసాన్ని కలిపి తీసుకుంటే మరింత రెట్టింపు ప్రయోజనాలు అంటున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Jan 03, 2025 | 3:39 PM

మజ్జిగలో చెంచా అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం మజ్జిగలో కలుపుకొని తాగితే బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. ఇందులోని లాక్టోజ్, కార్బోహైడ్రేట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.

ప్రతిరోజూ గ్లాసుడు మజ్జిగలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తాగడం వల్ల కొవ్వు కణాల విచ్ఛిన్నం ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. అల్లం యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి.

మీ రోజువారీ ఆహారంలో మజ్జిగ, అల్లం రసాన్ని చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది సీజనల్ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆకలి లేని వారు మధ్యాహ్నం గ్లాస్ మజ్జిగలో కొద్దిగా అల్లం రసం, ఉప్పు, కొత్తిమీర కలిపి తాగితే ఫలితం ఉంటుంది.. దీంతో ఆకలి పెరుగుతుంది. అజీర్ణం తగ్గుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. మజ్జిగను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి కూడా బయట పడవచ్చు.





























