- Telugu News Photo Gallery These Vastu rules are mandatory in case of Chapati Peeta and Karra, Check Here is Details
Vastu Tips: చపాతీ పీట, కర్ర విషయంలో ఈ వాస్తు నియమాలు తప్పనిసరి..
ప్రతీ ఒక్కరి ఇంట్లో కామన్‌గా ఉండే వస్తువుల్లో చపాతీ పీట, కర్ర కూడా ఒకటి. వీటితో ఎక్కువగా చపాతీలు, పూరీలు వంటివి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. వీటి విషయంలో కూడా వాస్తు నియమాలు వర్తిస్థాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు..
Updated on: Jan 03, 2025 | 1:41 PM

వాస్తు నియమాలు అనేవి కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే వర్తిస్తాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తు నియమాలు కేవలం ఇంటి నిర్మాణ విషయంలోనే కాదు. ఇంట్లో మీరు ఉపయోగించే, ఏర్పరిచే వస్తువులకు వర్తిస్తుంది.

ఈ వాస్తు నియమాలు అనేవి చపాతీ కర్ర, పీట విషయంలో కూడా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. చపాతీ పీట, కర్ర ఏమున్నాయిలే అనుకుంటే పొరపాటే. చపాతీ కర్ర, పీటను కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి.

వీటిని ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు. కేవలం బుధ, గురు వారాల్లో మాత్రమే కొనాలి. అలాగే సోమ, శనివారాల్లో వీటిని కొనకూడదు. చపాతీ పీట, కర్రలో ఎత్తు పల్లాలు లేకుండా, సరిగ్గా ఉండాలని చెబుతున్నారు.

అలాగే మీరు చపాతీ కర్రతో.. చపాతీలు, పూరీలు వంటివి చేసినప్పుడు సౌండ్ రాకూడదు. కొనేటప్పుడే టెస్ట్ చేసి చూడండి. అలా ధ్వని వస్తుంటే మాత్రం వాటిని పక్కకు పెట్టి.. మరొకటి తీసుకోవడం మంచిది. సౌండ్ రావడం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయట.

చపాతీ పీట, కర్రను ఉపయోగించిన తర్వాత ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. కాబట్టి వీటి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)





























