Hyderabad: వీళ్లు తండ్రులు కాదు.. నీచులు.. కేస్ స్టడీలో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి.. పాపం ఆ చిన్నారులు..
హైదరాబాద్ సిటీలో చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కొత్త చట్టాల్లో చిన్నారులపై నేరాలకు కఠిన శిక్షలు ఉన్నప్పటికీ కొందరు నిందితుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రావడం లేదు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలకు సంబంధించి జరిపిన కేస్ స్టడీలో ఆశ్చర్యపోయే అంశాలు బయటపడ్డాయి..
హైదరాబాద్ సిటీలో చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కొత్త చట్టాల్లో చిన్నారులపై నేరాలకు కఠిన శిక్షలు ఉన్నప్పటికీ కొందరు నిందితుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రావడం లేదు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలకు సంబంధించి జరిపిన కేస్ స్టడీలో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.. గడిచిన ఆరు నెలల వ్యవధిలో హైదరాబాదులో సుమారు 409 పొక్సో కేసులు నమోదు అయ్యాయి. 409 పోక్సో కేసుల్లో ఎక్కువ శాతం తెలిసిన వారే నిందితులుగా ఉండటం గమనార్హం. వీరిలో 13 మంది తండ్రులు నిందితులుగా ఉన్నారు. తెలిసిన వారిలో ఎక్కువ శాతం వాచ్మెన్లు, రక్త సంబంధికులు ఉన్నారు. ఇలా జంట నగరాల్లో చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. వీరిలో 385 కేసుల్లో తెలిసిన వారే నిందితులుగా ఉన్నారు. మరో 24 కేసుల్లో అపరిచితులు నిందితులుగా ఉన్నారు.
భార్య విడిపోయిన సందర్భాల్లో కొంతమంది భర్తలు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మరోవైపు తమకు నచ్చిన పురుషులతో ఉంటున్న మహిళల కారణంగా.. పెంపుడు తండ్రులు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎక్కువ సంఖ్యలో ఇలాంటి దారుణాలకు గురవుతున్న బాధితులు 15 నుండి 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారు. అయితే వీరి పట్ల తమ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు విశ్లేషించారు.
వీటితో పాటు విద్యాసంసల్లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 08. పాఠశాలల్లో విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు పోలీసులు తరఫునుంచి చేపడుతున్నారు. పలువురు ఉపాధ్యాయులతో కలిసి చిన్నారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చిన్నారులకు అవగాహన వచ్చేలా ప్రతి పాఠశాలలోనూ అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే.. ఇలాంటి మానవ మృగాల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..