Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో గత వారం పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో గత వారం పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలా కనిపించటం లేదు. తెలంగాణకు మరోసారి వాన హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షానికి తోడు భారీగా ఈదురు గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని.. మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రానికి నగర వ్యాప్తంగా జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.