Telangana: గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. రిజర్వేషన్లు పది శాతానికి పెంపు.. తక్షణమే అమలులోకి..

తెలంగాణలో గిరిజనులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చుకున్నారు. బంజారా భవన్ ప్రారంభోత్సవ సభలో గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతామని చెప్పారు. ఈ మేరకు ఆరు నుంచి పది శాతానికి..

Telangana: గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. రిజర్వేషన్లు పది శాతానికి పెంపు.. తక్షణమే అమలులోకి..
Cm Kcr
Follow us

|

Updated on: Oct 01, 2022 | 7:27 AM

తెలంగాణలో గిరిజనులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చుకున్నారు. బంజారా భవన్ ప్రారంభోత్సవ సభలో గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతామని చెప్పారు. ఈ మేరకు ఆరు నుంచి పది శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జీవో నెం.33 ను విడుదల చేసింది. చెల్లప్ప కమిషన్‌ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు (ఎ గ్రూపు-7, బి-10, సి-1, డి-7, ఇ-4) 29, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు వస్తాయి. తద్వారా రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం ప్రగతి భవన్‌కు వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చివరకు ఆమోదించారు.

ఈ నెల 17న జ‌రిగిన ఆదివాసీ, గిరిజ‌నుల ఆత్మీయ స‌భ‌లో చేసిన ప్రక‌ట‌న‌కు అనుగుణంగా నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజ‌నుల‌కు అమ‌ల‌వుతున్న ఆరు శాతం రిజ‌ర్వేష‌న్ల విధానాన్నే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వ‌ర‌కు అమ‌లు చేస్తూ వ‌చ్చింది. ఈ క్రమంలో వచ్చిన మార్పులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకుని సీఎం కేసీఆర్ రిజర్వేషన్లను పెంచారు. రాష్ట్రంలో గిరిజ‌నుల జ‌నాభాకు అనుగుణంగా వారికి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచాల‌ని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించి.. రాష్ట్రప‌తి అనుమ‌తి కోసం కేంద్రానికి పంపింది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికార వర్గాలు వెల్లడించారు. దీంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచినట్లు తెలిపాయి.

గిరిజ‌నుల స‌మ‌స్యలు, జీవ‌న స్థితి గ‌తుల‌పై అధ్యయ‌నానికి తెలంగాణ సర్కార్ చెల్లప్ప క‌మిటీని నియ‌మించింది. చెల్లప్ప క‌మిటీ గిరిజ‌నుల సమస్యలు, ప‌లువురు ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు తీసుకుంది. గిరిజ‌నుల అభివృద్ధి కోసం వారికి విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం, ప్రభుత్వ ఉద్యోగ నియామ‌కాల్లో రిజ‌ర్వేష‌న్లు పెంచ‌డం ఒక్కటే ప‌రిష్కార మార్గం అని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార‌్సు చేసింది. ఈ సిఫార్సు సూచనను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లు ఉండగా సీఎం ప్రకటనతో గిరిజనులకు మరో 4 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. వీటితో పాటు త్వరలోనే గిరిజన బంధును కూడా అమలు చేస్తామని ప్రకటించారు. భూమి లేని గిరిజనులకు రూ.10 లక్షలు సాయం చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ’ లో సీఎం కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!