Jubliee Hills Rape Case: నిందితులంతా మేజర్లే.. జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో మరో కీలక మలుపు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ మైనర్‌ రేప్‌ కేస్‌ మరో కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక రేప్‌ కేసులో సెన్షేషనల్‌ జడ్జిమెంట్‌ ఇచ్చింది జువెనైల్‌ కోర్టు.

Jubliee Hills Rape Case: నిందితులంతా మేజర్లే.. జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో మరో కీలక మలుపు
Jubliee Hills Rape Case
Follow us

|

Updated on: Oct 01, 2022 | 2:01 PM

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ మైనర్‌ రేప్‌ కేస్‌ మరో కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక రేప్‌ కేసులో సెన్షేషనల్‌ జడ్జిమెంట్‌ ఇచ్చింది జువెనైల్‌ కోర్టు. ఐదుగురు మైనర్‌ నిందితుల్లో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ తీర్పు చెప్పింది. ట్రయల్‌ టైమ్‌లో నలుగురు మైనర్లనూ మేజర్లుగా ట్రీట్‌ చేయాలంటూ ఆదేశాలిచ్చింది. సైకియాట్రిస్ట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది జువెనైల్‌ జస్టిస్ బోర్డు(spot). నేరానికి పాల్పడ్డ సమయంలో నిందితుల వయసు పదహారు నుంచి 18ఏళ్లు కావడంతో జువెనైల్‌ కోర్టును ఆశ్రయించారు పోలీసులు. తీవ్రమైన నేరానికి పాల్పడినందున నిందితులందరినీ మేజర్లుగా పరిగణించాలని కోర్టును కోరారు కాప్స్‌. దాంతో, నిందితుల సీసీఎల్‌లను ప్రత్యేక కేసుగా ట్రీట్‌చేసి విచారణ చేపట్టింది జువెనైల్‌ బోర్డు. మానసిక నిపుణుడి సహాయంతో మెంటల్‌ స్టేటస్‌ను విశ్లేషించింది. ఈ నలుగురు నిందితులకూ మద్యం అలవాటు లేదని, నేరం చేసిన టైమ్‌లో మద్యం తాగలేదని నిర్ధారించుకుంది బోర్డు. చివరికి ఐదుగురు మైనర్‌ నిందితుల్లో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ జడ్జిమెంట్‌ ఇచ్చింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఎమ్మెల్యే కొడుకు విషయంలో మాత్రం ప్రాథమిక అంచనాకి రాలేకపోయింది బోర్డు. ఎమ్మెల్యే కొడుకుపై ఉన్న అభియోగం తీవ్రమైనది కాకపోవడంతో మైనర్‌గా పరిగణించాలని జువెనైల్‌ జస్టిస్ బోర్డు నిర్ణయించింది.

కాగా.. ఈ ఏడాది మే 28న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలిక (17)ను కొందరు ఇంటి వద్ద దించుతామని నమ్మించి కారులో తీసుకువెళ్లారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంటనే చర్యలు తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సాదుద్దీన్‌ మాలిక్‌(19) తోపాటు మరో ఐదుగురు మైనర్లను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?