AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HYDRA: హైడ్రా బుల్డోజర్లకు ఫస్ట్ యానివర్సరీ – ప్రొగ్రెస్ రిపోర్ట్ ఏంటి..?

సీఎం రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా, ఐపీఎస్ అధికారి రంగనాధ్ కమిషనర్‌గా గత ఏడాది జూల్ 19న ఏర్పాటైంది హైడ్రా. సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. దేశంలోని మహానగరాలన్నిటికి దిక్సూచిలా మారబోతోంది మా హైడ్రా అని సర్టిఫికెట్లు కూడా ఇచ్చుకుంది తెలంగాణ సర్కార్. ఫస్ట్‌ వన్ ఇయర్‌లో హైడ్రా సక్సెస్ రేట్ ఎంత? హైడ్రా ఖాతాలో కూడబెట్టుకున్న ఫెయిల్యూర్లెన్ని? ప్రస్తుతానికి మొండికేసిన హైడ్రా బుల్డోజర్లు ముందుకా వెనక్కా..?

HYDRA: హైడ్రా బుల్డోజర్లకు ఫస్ట్ యానివర్సరీ - ప్రొగ్రెస్ రిపోర్ట్ ఏంటి..?
HYDRA
Ram Naramaneni
|

Updated on: Jul 19, 2025 | 8:35 PM

Share

చెరువుతో సంబంధం లేకపోయినా ప్రైవేట్‌ ఆస్తులను హైడ్రా కూల్చివేసిందన్నది  మాదాపూర్‌లోని సున్నంచెరువు దగ్గర సియెట్ సొసైటీ వాసుల కడుపుమంట. హైడ్రా లక్ష్యం ఏదైనా… అది నానా వంకర్లూ తిరిగి.. వైఫల్యాల్ని మూటగట్టుకుంది. జనం తోడుతోనే నగరాన్ని బాగుచేద్దామన్న హైడ్రా మూలసిద్ధాంతం కాస్తా అడ్డం తిరిగిందా? అన్న ప్రశ్నలు కొన్ని వైపుల నుంచి వస్తున్నాయి. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు దంచికొట్టిన వానతో భాగ్యనగరం నిండా మునిగి.. ట్రాఫిక్ ఫికర్‌తో బెంబేలెత్తిపోయింది. గచ్చిబౌలీ గట్రా కాస్ట్‌లీ కాస్మొపొలిటన్ ఏరియాలే బావురుమన్న వేళ.. ఒక షోరూమ్‌లో పది అడుగుల మేర నీళ్లుచేరి, 40 మంది సిబ్బంది చిక్కుకుపోతే ఓ చెయ్యందించి బైటికి లాగి ప్రాణం పోసింది హైడ్రా. మోకాల్లోతు నీళ్లల్లో దిగి స్వయానా క‌మిష‌న‌ర్ రంగ‌నాథే రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. దిసీజ్ ది కమిట్‌మెంట్ ఆఫ్ హైడ్రా అని చేతల్లో చూపెట్టే ప్రయత్నం చేశారు. ఒకేరోజు జరిగిన ఈ రెండు ఘటనలు చాలు హైడ్రా పిక్చర్ పర్‌ఫెక్ట్‌గా ఉందా గందరగోళాన్ని పెంచిందా తెలీడానికి. ఏదైనా సంస్కరణ మొదలైనప్పుడు దానికి ఆటుపోట్లు తప్పవు. ముందుకెళ్లాలన్న ఆలోచనతో పాటే వెనక్కు లాగే పరిస్థితులూ ఉంటాయి. అలాగే హైడ్రాకూ తప్పలేదు పురిటినొప్పులు. ఆశయం గొప్పదే కావచ్చు.. ఆచరణ దగ్గరేగా తలనొప్పులు? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. హైడ్రా! చెరువులు, నాలాలు, పార్కులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాల రక్షణ కోసం ఏర్పాటైన ప్రత్యేక యంత్రాంగం. జీహెచ్ ఎంసీ, దాని...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి