Hyderabad: పాతబస్తీలో కారు బీభత్సం.. కారు ఢీ కొని ఎగిరిపడిన మహిళ.. సీసీటీవీలో రికార్డ్
హైదరాబాద్ పాతబస్తీ(Old City) కామాటిపురలో (Kamatipuram) కారు బీభత్సం సృష్టించింది. ఫతే దర్వాజ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై క్వాలిస్ వాహనం దూసుకొచ్చింది.
Hyderabad: ఎన్ని చట్టాలు తెచ్చినా, పోలీసులు, అధికారులు, సామజిక కార్యకర్తలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. వాహనదారులకు తీరు మారడం లేదు. సరదాకోసమో, లేక త్వరగా గమ్యం చేరుకోవాలనే ఆత్రుతతోనే వాహనాలను పరిమితికి మించిన వేగంతో నడుపుతున్నారు.. ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ పాతబస్తీ(Old City) కామాటిపురలో (Kamathipura) కారు బీభత్సం సృష్టించింది. ఫతే దర్వాజ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లులపై క్వాలిస్ వాహనం దూసుకొచ్చింది. వేగంగా కారు ఢీకొట్టడంతో.. మహిళ ఎగిరిపడింది. ఆ విజువల్స్ అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. మహిళలు దర్గా నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం మహిళను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ గుండెపోటు రావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కారు డ్రైవర్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు క్వాలిస్ డ్రైవర్ పై 279, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
Reporter : Noor, TV9 Telugu
మరన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..