Hyderabad: భాగ్యనగరవాసులకు గుడ్ న్యూస్.. రేపు కైత్లాపూర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్(Hyderabad) నగరవాసులకు మరో ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్(Minister KTR).. రేపు కైత్లాపూర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. 86 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌...

Hyderabad: భాగ్యనగరవాసులకు గుడ్ న్యూస్.. రేపు కైత్లాపూర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
Kaithalapur Flyover
Follow us

|

Updated on: Jun 20, 2022 | 3:29 PM

హైదరాబాద్(Hyderabad) నగరవాసులకు మరో ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్(Minister KTR).. రేపు కైత్లాపూర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. 86 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీని అనుసంధానిస్తూ నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌తో 3.5 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రయాణ సమయం గంట ఆదా అవుతుంది. బోరబండ(Borabanda) ఎంఎంటీఎస్ స్టేషన్‌లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (SRDP) కింద దీనికి మరమ్మతులు చేపట్టారు. ఈ వంతెన కూకట్‌పల్లిని హైటెక్ సిటీతో కలుపుతుంది. జేఎన్టీయూ, మలేషియా టౌన్‌షిప్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, సైబర్ టవర్ కూడలి వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. సనత్‌నగర్‌, బాలానగర్‌, సికింద్రాబాద్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మాదాపూర్‌ ప్రధాన రహదారిపై మూసాపేట్‌ మీదుగా కైతలాపూర్‌ వైపు మళ్లిస్తారు. దీనివల్ల దూరం 3.5 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రయాణానికి పట్టే సమయం కనీసం ఒక గంట తగ్గుతుంది. బ్రిడ్జిపై రహదారి మొత్తం పొడవు 675.50 మీటర్లు, వెడల్పు సుమారు 16.6 మీటర్లు. ఇది 5.5 మీటర్ల సర్వీస్ లేన్‌ నిర్మతమైంది.

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు ఎస్‌ఆర్‌డీపీ చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఖైతలాపూర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జితో పాటు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ జూన్ లోనే అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత పనులను ఈ సంవత్సరం డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి