Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో రెండు రోజులు మంచి నీటి సరఫరాకు అంతరాయం.
రైల్వే శాఖ సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ - 1 లో కొండపాక నుంచి ఘన్ పూర్‌కు,,
రైల్వే శాఖ సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో కొండపాక నుంచి ఘన్ పూర్‌కు ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపు లైన్ ను పక్కకు మార్చాల్సి ఉంది. ఇందులో భాగంగానే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అయితే ఈ పైప్ లైన్ పనుల నేపథ్యంలో నగరంలో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి, మార్చి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు మొత్తం 48 గంటల పాటు పనులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం ఏర్పడనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
నీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాలు..
* ఓ అండ్ ఎం డివిజన్ నం.12 (కుత్బుల్లాపూర్) : షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం.
* ఓ అండ్ ఎం డివిజన్ నం.13 (మల్కాజ్ గిరి/అల్వాల్) : డిఫెన్స్ కాలనీ.
* ఓ అండ్ ఎం డివిజన్ నం. 19 : నాగారం/ దమ్మాయి గూడ, కీసర.
* ఓ అండ్ ఎం డివిజన్ నం. 24 (బొల్లారం) : రింగ్ మెయిన్-3 ఆన్ లైన్ సప్లై.
* ఓ అండ్ ఎం డివిజన్ నం. 25 (కొంపల్లి) : కొంపల్లి, గొండ్ల పోచంపల్లి ప్రాంతాలు.
* ఆర్ డబ్య్లూఎస్ ఆఫ్ టేక్ ప్రాంతాలు : కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు.
* ఓ అండ్ ఎం డివిజన్ నం. 14 (ఉప్పల్) : కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు.
పాక్షికంగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:
* ఓ అండ్ ఎం డివిజన్ నం. 6 (ఎస్. ఆర్. నగర్) : బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ.
* ఓ అండ్ ఎం డివిజన్ నం. 9 (కూకట్ పల్లి) : కేపీహెచ్ బీ, మల్యాసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు.
* ఓ అండ్ ఎం డివిజన్ నం. 15 (శేరిలింగం పల్లి) : లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు.
* ఓ అండ్ ఎం డివిజన్ నం. 23 ( నిజాంపేట్) : ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్/ బాచుపల్లి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..