Hyderabad: నగరవాసులకు అలెర్ట్‌.. బుధవారం ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే

బుధవారం (డిసెంబర్‌21) ఎల్బీ స్టేడియంలో క్రైస్తవసోదరులకు సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ విందు ఇవ్వనున్న నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.

Hyderabad: నగరవాసులకు అలెర్ట్‌.. బుధవారం ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే
Traffic Restrictions

Updated on: Dec 20, 2022 | 6:38 PM

నగరవాసులకు ముఖ్య గమనిక.. బుధవారం (డిసెంబర్‌21) ఎల్బీ స్టేడియంలో క్రైస్తవసోదరులకు సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ విందు ఇవ్వనున్న నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఓల్డ్ పోలీస్ కంట్రోల్ రూమ్, బషీర్‌బాగ్, పీజేఆర్‌ విగ్రహం సర్కిల్, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్, ఏఆర్‌ పెట్రోల్ పంప్ (పబ్లిక్ గార్డెన్స్), నాంపల్లి, కేఎల్‌కే బిల్డింగ్, లిబర్టీ, రవీంద్ర భారతి, లక్డికాపూల్, హిమాయత్ నగర్, అసెంబ్లీ, MJ మార్కెట్, హైదర్‌గూడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిపివేస్తారని లేదా వాహనాలు మళ్లిస్తారని పోలీసులు పేర్కొన్నారు. నగరవాసులు ఈ సూచనలు గమనించాలని, ముందస్తుగా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం కలిగితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్- 9010203626లో కు ఫోన్‌ చేయాలని కోరారు..

ఆర్టీసీ బస్సులు కూడా..

ట్రాఫిక్‌ ఆంక్షల్లో భాగంగా రవీంద్ర భారతి నుండి అబిడ్స్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఎల్బీ స్టేడియం మెయిన్ గేట్ నుండి, ఏఆర్‌ పెట్రోల్ (పబ్లిక్ గార్డెన్స్) బంక్ వద్ద నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు. అలాగే పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి నిజాం కళాశాల వైపు వచ్చే వాహనాలు నాంపల్లి, చాపెల్‌రోడ్‌ వైపు మళ్లిస్తారు. అబిడ్స్‌ నుంచి నిజాం కళాశాల వైపు వచ్చే వాహనాలు ఎస్‌బీఐ, గన్‌ ఫౌండ్రి, నాంపల్లి రైల్వేస్టేషన్‌ మీదుగా మళ్లించనున్నారు. బషీర్‌బాగ్‌ నుంచి నిజాం కళాశాల వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ మీదుగా మళ్లించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక క్రిస్మస్‌ ట్రీట్‌ కోసం ఎల్బీ స్టేడియంకు వచ్చే వారికి ముందస్తుగా పాస్‌లు జారీ చేసినట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..