Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మరో చార్జ్‌షీట్.. ఇందులోనూ కవిత పేరు..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మరో చార్జ్‌షీట్ దాఖలు చేసింది ఈడీ. కొత్త చార్జ్‌షీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొన్నారు అధికారులు. ఈ చార్జ్‌షీట్‌లో కవిత తో పాటు మాగుంట పేర్లు కూడా ఉన్నాయి.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మరో చార్జ్‌షీట్.. ఇందులోనూ కవిత పేరు..
Mlc Kavitha
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 20, 2022 | 10:59 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మరో చార్జ్‌షీట్ దాఖలు చేసింది ఈడీ. కొత్త చార్జ్‌షీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొన్నారు అధికారులు. ఈ చార్జ్‌షీట్‌లో కవిత తో పాటు మాగుంట పేర్లు కూడా ఉన్నాయి. సమీర్‌ కంపెనీలో కవితకు 32శాతం వాటా ఉన్నట్లు అభియోగం మోపారు. సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్‌లో ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మూత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ రావు పేర్లు ఉన్నాయి. ఒబారాయ్ హోటల్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ఈడీ విచారణలో పేర్కొన్నారు సమీర్ మహేంద్రు. శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు ఢిల్లీ ఒబారాయ్ హోటల్ సమీర్ మహేంద్రు కలిసినట్టు ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.

అనంతరం నలుగురు కలిసి శరత్ చంద్రా రెడ్డికి సంబంధించిన ప్రత్యేక విమానం(చార్టెడ్ ఫ్లైట్)లో హైదరాబాద్ వెళ్లినట్టు ఈడీ చార్జ్‌ షీట్‌లో పేర్కొంది. అంతకుముందు ఒబారాయ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌లో కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్ నాయర్ పాల్గొనట్టు సమీర్ మహేంద్రు చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. అలాగే, ఇండో స్పీరిట్స్‌లో ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవిత కు వాటా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్ కి రూ. 192.8 కోట్లు లాభం వచ్చిందని, ఇదంతా నేరపూరితమైన మార్గంలో వచ్చినట్టు పేర్కొంది ఈడీ. ఇక శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఐదు రిటైల్ జోన్లను అభిషేక్ రావు నడిపిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. కాగా, కవిత వాడి ధ్వంసం చేసిన పది ఫోన్ల వివరాలను సమీర్ మహేంద్రు చార్జ్‌షీట్‌లో పేర్కొంది ఈడీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..