Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఆ ఆఫర్లను పొడగిస్తూ..

ఇదిలా ఉంటే ఆఫర్లను పొడగిస్తూ గుడ్‌ న్యూస్‌ చెప్పిన మెట్రో.. మరో బ్యాడ్‌ న్యూస్‌ను చెప్పింది. నాగోల్‌తో పాటు, మియాపూర్ స్టేషన్స్‌లో పార్కింగ్ ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్‌ 6 తేదీ నుంచి ఈ ఫీజు వసూలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ పార్కింగ్ ఫీజులు కేవలం నామమాత్రంగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు...

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఆ ఆఫర్లను పొడగిస్తూ..
Hyderabad Metro
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 30, 2024 | 6:55 PM

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఒక శుభవార్త అదే సమయంలో ఒక బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక శుభవార్త విషయానికొస్తే.. మెట్రో రైల్ ఆఫర్లను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు ఆఫర్లను 2025 మార్చి 31 వరకు ఆఫర్లను పొడిగించినట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం మెట్రో అందిస్తున్న.. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగించింది. అలాగే స్మార్ట్‌ కార్డులపై ఆఫ్‌ పీక్‌ అవర్స్‌లో 10 శాతం రాయితీని పొడగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే ఆఫర్లను పొడగిస్తూ గుడ్‌ న్యూస్‌ చెప్పిన మెట్రో.. మరో బ్యాడ్‌ న్యూస్‌ను చెప్పింది. నాగోల్‌తో పాటు, మియాపూర్ స్టేషన్స్‌లో పార్కింగ్ ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్‌ 6 తేదీ నుంచి ఈ ఫీజు వసూలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ పార్కింగ్ ఫీజులు కేవలం నామమాత్రంగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత కోసమే ఈ రుసుము వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వివరణ ఇచ్చారు.

అయితే పార్కింగ్ ఫీజును వసూలు చేసే క్రమంలో మెట్రో అధికారులు ప్రయాణికులకు పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే ప్రయాణికుల కోసం బయో టాయిలెట్లు, సాయంత్రం వేళల్లో తగిన వెలుతురు కోసం లైట్ల ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే.. 24/7 భద్రత, సీసీటీవీలు ఏర్పాటు, లావాదేవీల సౌలభ్యం కోసం యాప్, ఫీజుల చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ప్రయాణికుల కోసం తాగునీటి సౌకర్యం, మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వీటితో పాఉట.. సమీప ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, అగ్నిమాపక స్టేషన్ వంటి అత్యవసర సంప్రదింపు వివరాలను ప్రదర్శించనున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ