AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Speed Guns: రోడ్డు ఖాళీగా ఉంది.. ట్రాఫిక్‌ పోలీస్‌ లేడని.. దూసుకుపోతున్నారా? ఇంటికి చలానా‌ వస్తుంది జాగ్రత్త..

Speed Guns On Hyderabad Roads: రోడ్డు ఖాళీగా ఉండి, ట్రాఫిక్‌ పోలీస్‌ లేకపోతే బైకర్లకు పండగే. మరీ ముఖ్యంగా యువత ఒక ఓ రేంజ్‌లో రెచ్చి పోతారు. బైక్‌ను రయ్యి రయ్యి మంటూ స్పీడ్‌ను వంద దాటిస్తుంటారు. అయితే ఇకపై..

Speed Guns: రోడ్డు ఖాళీగా ఉంది.. ట్రాఫిక్‌ పోలీస్‌ లేడని.. దూసుకుపోతున్నారా? ఇంటికి చలానా‌ వస్తుంది జాగ్రత్త..
Speed Guns
Narender Vaitla
|

Updated on: Apr 06, 2021 | 2:18 PM

Share

Speed Guns On Hyderabad Roads: రోడ్డు ఖాళీగా ఉండి, ట్రాఫిక్‌ పోలీస్‌ లేకపోతే బైకర్లకు పండగే. మరీ ముఖ్యంగా యువత ఒక ఓ రేంజ్‌లో రెచ్చి పోతారు. బైక్‌ను రయ్యి రయ్యి మంటూ స్పీడ్‌ను వంద దాటిస్తుంటారు. అయితే ఇకపై ఇలాంటి పప్పులు ఉడకవు. రోడ్డు ఖాళీగా ఉందని బైక్‌ వేగాన్ని పెంచితే.. జేబుకు చిల్లు పడినట్లే. వివరాల్లోకి వెళితే.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లే వాహనాలను గుర్తించడానికి హైదరాబాద్‌ పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఓఆర్‌ఆర్‌, హైవేలకే పరిమితమైన స్పీడ్‌ గన్స్‌ను సిటీ రోడ్లపై కూడా ఏర్పాటు చేశారు. విశాలమైన రోడ్లు ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్‌లో ఉన్న హైటెక్‌ సిటీ, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, బయో డైవర్సిటీ, నార్సింగ్‌ తదితర ప్రాంతాల్లోని రహదారులపై స్పీడ్‌ గన్స్‌ ఏర్పాటు చేశారు. ఇవి ఉన్నాయన్న విషయం కూడా వాహనదారుడికి తెలియదు. కానీ నిర్ణీత వేగం మించితే మాత్రం వెంటనే ఈ చలానా‌ వస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల నగరంలో కొన్ని రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. మితిమీరిన వేగమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇలాంటి ప్రమాదాలకు చెక్‌ పెట్టడానికే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరి ఇప్పటి నుంచి వాహనం స్పీడ్‌ పెంచే సమయంలోనైనా మిమ్మల్ని స్పీడ్‌ గన్‌ గమనిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదన్నమాట.

Also Read: Coronavirus: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ రేటు రెట్టింపు.. ఐదు రోజుల్లోనే భారీగా పెరిగిన కేసులు

Beer Sales In Hyderabad: హైదరాబాదీలు తెగ తాగేస్తున్నారు.. బీర్ల విక్రయాల్లో సరికొత్త రికార్డు.. ఎండాకాలంలో పెరిగిన..

CM KCR Siddipet Tour: నేడు కేసీఆర్‌ సిద్దిపేట టూర్‌.. సంగారెడ్డి కాలువకు గోదావరి నీటిని విడుదల చేయనున్న సీఎం.