CM KCR Siddipet Tour: నేడు కేసీఆర్ సిద్దిపేట టూర్.. సంగారెడ్డి కాలువకు గోదావరి నీటిని విడుదల చేయనున్న సీఎం.
CM KCR Siddipet Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (మంగళవారం) సిద్దిపేట జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం సంగారెడ్డి కాలువకు గోదావరని నీటిని విడుదల చేయనున్నారు...
CM KCR Siddipet Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (మంగళవారం) సిద్దిపేట జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం సంగారెడ్డి కాలువకు గోదావరని నీటిని విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు, అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. సీఎం టూర్‌కు సంబంధించిన పనులను పార్టీకి చెందిన ముఖ్య నేతలు పర్యవేక్షించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్‌కు నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంకు సమీపంలో ఉన్న నవోదయ విద్యాలయం వద్ద సీఎం సంగారెడ్డి కెనాల్‌కు నీటిని విడుదల చేస్తారు. దీంతో ఏళ్లుగా నీరు లేక వెలవెలబోతున్న హల్దీ వాగు నీటితో నిండనుంది. ఎండ కాలంలోనూ వాగులో నీరు ఉండేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ నుంచి సంగారెడ్డి కాలువకు నీటిని విడదుల చేయనున్నారు. ప్రాజెక్ట్ నుంచి నీరు వర్గల్ మండలం తునికిఖాల్సా మీదుగా అంబర్‌పేటలోని ఖాన్ చెరువకు చేరుతుంది. అనంతరం ఖాన్ చెరువు నుంచి హల్దీ వాగుకు ఆ తర్వాత తూఫ్రాన్, వెల్లుర్తి, చిన్న శంకరంపేట మీదుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సాగునీరు చేరనుంది. ఇప్పటికే కూడవెళ్లి వాగు ద్వారా 67 కి.మీల మేర 37 చెక్ డ్యామ్‌ల మీదుగా.. సిద్ధిపేట, సిరిసిల్లా జిల్లాలకు గోదావరి నీరు చేరిన విషయం తెలిసిందే.
Also Read: Chhattisgarh Encounter: శంషాబాద్ విమానాశ్రయంలో వీర జవానుకు నివాళులు అర్పించిన సీపీ సజ్జనార్
Yadadri Temple : త్వరలోనే యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం..! నిత్యం పనులను సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్..