Hyderabad: నిమజ్జనం వేడుకల్లో పోలీసుల జోష్‌.. అదిరిపోయే డ్యాన్స్‌తో ధూమ్‌ధామ్‌

మొత్తం 40 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేలకిపైగా సీసీ కెమెరాలతో హైదరాబాద్ నగరం మొత్తం నిఘా నీడలో ఉంది. ఇక బడా గణేశుడు ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం హుస్సేన్‌ సాగర్‌లో ముగిసింది. భరీ గణేశుడిని వీక్షించేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శోభయాత్రను, నిమజ్జనాన్ని అధికారులు పూర్తి చేశారు....

Hyderabad: నిమజ్జనం వేడుకల్లో పోలీసుల జోష్‌.. అదిరిపోయే డ్యాన్స్‌తో ధూమ్‌ధామ్‌
Hyderabad Police Dance
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 28, 2023 | 2:32 PM

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఎటు చూసినా జన సంద్రోహం నెలకొంది. నగరవ్యాప్తంగా హుస్సేన్‌సాగర్‌తో పాటు మొత్తం 100 ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సాగుతోంది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం లక్షకుపైగా విగ్రహాల నిమజ్జనం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక హుస్సేన్‌ సాగర్‌ పరిసర ప్రాంతాలు మొత్తం జనంతో నిండిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు.

మొత్తం 40 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేలకిపైగా సీసీ కెమెరాలతో హైదరాబాద్ నగరం మొత్తం నిఘా నీడలో ఉంది. ఇక బడా గణేశుడు ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం హుస్సేన్‌ సాగర్‌లో ముగిసింది. భరీ గణేశుడిని వీక్షించేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శోభయాత్రను, నిమజ్జనాన్ని అధికారులు పూర్తి చేశారు. భారీ క్రేన్‌ సహాయంతో ఖైరతాబాద్‌ గణేశుడి విగ్రహాన్ని హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేశారు.

 

ఇదిలా ఉంటే గణేశుడి శోభా యాత్రలో జనాలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. భక్తులు డీజీ సౌండ్స్‌తో గణనాథులను గంగమ్మ ఒడికి పంపిస్తున్నారు. డ్యాన్స్‌లు చేస్తూ ఉషారుగా శోభయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే డ్యూటీలో బిజీగా ఉన్న పోలీసులు సైతం చిల్‌ అయ్యారు. గణేశుడి నిమజ్జన పర్యవేక్షణలో ఉన్న పోలీసులు డీజే సౌండ్‌కు కాలు కదిపారు. ఓ గ్రూప్‌గా ఏర్పడ్డ పోలీసులు పని ఒత్తిడిని కాసేపు మరిచి చిందేశారు. ఇక వీరిలో ఓ పోలీస్ బాస్‌ వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. మైకేల్‌ జాక్సన్‌లా మారి అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం పోలీసుల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు పోలీసుల స్టెప్పులకు ఫిదా అవుతున్నారు.

ఇక గణేష్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 28వ తేదీన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జంట నగరాలతో పాటు మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో కూడా బంద్‌ ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారి చేసింది. గురువారం రోజు పైన తెలిపిన చోట్ల పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయకు సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జంట నగరాల్లో నిమజ్జనం సందర్భంగా 21 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. వీరితో పాటు అదనంగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీస్‌ ఫోర్స్‌తో నిఘా పెంచారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..